వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిలికానాంధ్ర 'మనబడి' ఉత్సవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

Nri
అమెరికాలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 'మనబడి' ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. జనవరి 17న బేఏరియాలోని సన్నీవేల్‌ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 1200 మంది హాజరయ్యారు. 25 కేంద్రాల నుంచి 300కు పైగా మనబడి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. మారేపల్లి శాస్త్రి వేద ప్రవచనాలు, తనికెళ్ల లీల ప్రార్థన గీతంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో 'ప్రవేశం', 'ప్రకాశం' తరగతి విద్యార్థులు తమ కేంద్రాల పతకాలతో శోభయాత్రలో పాల్గొన్నారు.

అనంతరం 'మనబడి' డీన్‌ చమర్తి రాజు, తూములూరు శంకర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 50కి పైగా కేంద్రాల్లో కొనసాగుతున్న మనబడి కార్యక్రమాలను భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. దీనికి అందరి ప్రోత్సాహం కావాలని కోరారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రఖ్యా వంశీ, కాత్యాయనులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

క్యూపర్టినోలోని కూచిభొట్ల శాంతి విద్యార్థుల బృందం ఆలపించిన మనబడి గీతాలు.. ఫ్రీమాంట్‌ నుంచి మాడభూషి జానకి విద్యార్థుల బృందం ప్రదర్శించిన మిత్రలాభం నాటకం, నాగమణి బృందం రసరమ్యగీతాలు ప్రేక్షకులను అలరించాయి. శృంగారం వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆలపించిన సుమతి శతక పద్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాజా మాధురి, మహేశ్వరి మద్దాలి, హోత జానకిదేవి, సుసర్లగౌరి శంకర్‌, తిరుమల పెద్దింటి శ్రీనివాస్‌, మంగళంపల్లి వసంత, మాలెంపాటి ప్రభ తదితరులు వివిధ అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమ సంచాలకులుగా కాజామాధురి, గుండ్లపల్లి వాణి, నిర్వహకులుగా బుద్ధవరపు వ్యవహరించారు. చివరగా కొండిపర్తి దిలీప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలుగు భోజనాన్ని అందరు ఆరగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X