• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొలరాడోలో ఘనంగా అన్నమాచార్య జయంతి

By Santaram
|

NRI
కొలరాడో: అన్నమయ్య సంకీర్తనలతో అమెరికా కొలెరాడోలోని ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. పదకవితా పితామహుడు అన్నమాచార్య జయంతిని కొలరెడో తెలుగు అసోషియేషన్‌ ఘనంగా నిర్వహించింది. అధిక సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సుమారు 5గంటలకు పైగా అన్నమాచార్యుని సంకీర్తనలను చిన్నారులు ఆలపించారు. కార్యక్రమం విజయవంతమవడంలో అసోషియేషన్‌ సభ్యులు వెంకట్‌ దొంతినేని, మూర్తి గరిమెళ్ల, శంకర్‌ గుంటూరు, శ్యామల తదితరులు కీలక పాత్ర పోషించారు. సంకీర్తనలను ఆలపించడంలో చిన్నారులకు శిక్షణనిచ్చిన ఆర్‌.ఛాయదేవికి కార్యక్రమం సమర్పకులు దేశీషేడ్స్‌ జ్ఞాపికతో సత్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X