వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాన్ ఫ్రాన్సిస్కోలో బతుకమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

nri
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఎన్నారైలు ఈ నెల 9వ తేదీన బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు. దాదాపు 250 మంది ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగ జరుపుకున్నారు. మహిళలు ఉల్లాసంతో బతుకమ్మలను తెచ్చి ఆడారు. ఆ తర్వాత బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పాశ్చాత్య సంస్కృతి మధ్య తమ స్వస్థలానికి చెందిన సంప్రదాయ బతుకమ్మను నిర్వహించుకోవడం వారిని ఎంతో ఉత్సాహపరిచింది. మసాలా గ్రిల్, సూరజ్ రెస్టారెంట్, ఉడుపి ప్యాలెస్ మంచి లంచ్ ను ఏర్పాటు చేశాయి. స్త్రీపురుషులకు, పిల్లలకు ఆటల పోటీలు జరిగాయి. నాలుగు ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ జెవెలర్స్ స్పాన్సర్ చేసింది.

బతుకమ్మ పండుగ అక్కడి కొందరికి కొత్త అనుభవం కాగా, మరికొందరికి తమ జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి పనికి వచ్చింది. ఆల్వాల్ పుట్టా, రాజా కప్పెర, సోమ్ కంచర్ల, విజేందర్ గిల్లెల, ప్రతిమా పుట్టా, రమా కప్పెర, స్వప్న కంచర్ల, వినీష్ గిల్లెల కృషితో బతుకమ్మ పండుగ నిర్వహణ విజయవంతమైంది. వాలంటీర్లుగా వ్యవహరించిన గంగాధర్ అండ్రు, రాజేందర్ కొమ్మిడి, సత్తయ్య వనం, రోహిత్ కప్పెరలను నిర్వాహకులు అభినందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X