హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో నాదెండ్ల ఆంధ్ర మంత్రం!

By Santaram
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
మిల్ పిటాస్: విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి వంటి పట్టణాలు కేంద్రంగా అభివృద్ధికి దోహదం చేయడానికి ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అందరూ హైదరాబాద్‌ కే రావాలని కోరుకోవడం సరికాదని, హైదరాబాద్ ఇప్పటికే ఇరుకైపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సియాటిల్‌లో జరిగిన ఐటి అంతర్జాతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌నుంచి ఐ.టి. నిపుణుల బృందంతో వచ్చిన నాదెళ్ల ఆ తర్వాత కాలిఫోర్నియా వచ్చారు. అనంతరం ఆయన కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో ప్రవాస తెలుగువారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అసెంబ్లీ కార్యక్రమాలు లైవ్‌లో ప్రజలముందుకు రావడం మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధులు శాసనసభలో బాగా ప్రవర్తిస్తున్నారా, సరిగా ప్రవర్తించడంలేదా, సమస్యలపై సరిగా స్పందిస్తున్నారా లేదా, మాట్లాడుతున్నారా, మౌనం వహిస్తున్నారా అన్న విషయాలను ప్రజలే చూసి అర్థం చేసుకుంటారని మనోహర్ అభిప్రాయపడ్డారు.

యువకుడు, విద్యాధికుడు అయిన నాదెళ్ల మనోహర్ ఇలా వచ్చి ప్రవాసుల అంతరంగంలో మెదులుతున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పడం ప్రశంసనీయమని తానా అధ్యక్షుడు జయరాం కోమటి శ్లాఘించారు. అసెంబ్లీలో కూడా ఆయన చాలా ఓర్పుతో నేర్పుతో వివాదాలను పరిష్కరించారని, మరీ ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఒకవైపు, సమైక్యాంధ్ర ఉద్యమం మరోవైపు కొనసాగుతుండగా, ఈ ఉద్యమాల నేపథ్యంలో అసెంబ్లీలో చోటుచేసుకున్న వివాదాలను డిప్యూటి స్పీకర్‌గా మనోహర్ సమర్థవంతంగా పరిష్కరించారని జయరాం కోమటి ప్రశంసించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X