వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారతీయ దర్శకుడి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijay Kumar
హ్యూస్టన్‌: జిహాదీ సాహిత్యం, ఆయుధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో అమెరికా విమానాశ్రయంలో భారత్‌కు చెందిన లఘుచిత్రాల దర్శకుడు విజయ్‌ కుమార్‌ను భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. హ్యూస్టన్‌లోని జార్జి బుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. విజయ్‌(40) సామాన్లను తనిఖీ చేస్తుండగా, వాటిలో హ్యాండ్ ‌గన్‌ లాంటి ఆయుధం ఉన్నట్లు సిబ్బంది సందేహించారు. ఈ సమయంలో ఆయన వ్యవహారశైలిని అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు.

లోహపు ముల్లులతో కూడిన కొన్ని ఇత్తడి ఆయుధాలను(బ్రాస్‌ నకిల్స్‌), హ్యాండ్‌గన్‌కు సంబంధించిన ఓ వివరణపత్రాన్ని, ఇస్లామిక్‌ సాహిత్యాన్ని, 10 వేల డాలర్ల నగదును విజయ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ప్రాంతం (విమానాశ్రయం)లో నిషేధిత ఆయుధం కలిగివున్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. టెక్సాస్‌లో ఈ ఆయుధంపై నిషేధం ఉంది. సోమవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్న జడ్జి, ఆయన బెయిలుకు పూచీకత్తు మొత్తాన్ని 50 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్లకు తగ్గించారు. ఇస్లామిక్‌ సదస్సులో పాల్గొనేందుకు హ్యూస్టన్‌ వచ్చినట్లు విజయ్‌ పోలీసులకు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X