వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

By Santaram
|
Google Oneindia TeluguNews

Liberty of statue
వాషింగ్టన్‌: అమెరికాలోని ఓ భారతీయుడికి 81 నెలల జైలుశిక్ష పడింది. చెన్నైకి చెందిన జైశంకర్‌ మరిముత్తు(36) అమెరికాలోని బ్రోకర్ల ఆన్‌లైన్‌ ఖాతాలను హ్యకింగ్‌ చేయడానికి కుట్ర పన్నాడని, షేర్‌ ధరలను 'మాయ' చేసేందుకు సదరు ఖాతాలను ఉపయోగించాడని అతనిపై అభియోగాలు నమోదయ్యాయి. అంతేగాక కంప్యూటర్‌ మోసం, హామీ పత్రాల మోసం, దొంగతనం తదితర కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

బ్రోకర్ల ఆన్‌లైన్‌ ఖాతాలను హ్యకింగ్‌ చేసి వాటిని థాయిలాండ్‌, భారత్‌ల నుంచి 2006 ఫిబ్రవరి- డిసెంబరుల మధ్య ఉపయోగించాడని పేర్కొన్నారు. కాగా మరిముత్తు ఇటీవల హాంకాంగ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. వారు నిందితుడిని అమెరికా పోలీసులకు అప్పగించారు. మంగళవారం మరిముత్తును నెబ్రస్కాలోని జిల్లా మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 81 నెలల జైలుశిక్షతో పాటు రూ.24 లక్షల జరిమానా విధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X