వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో బాబా ఆలయ శంకుస్ధాపన

By Santaram
|
Google Oneindia TeluguNews

Saibaba Temple
ఒహియో: అమెరికాలో సాయి భక్తులు భక్త పారవశ్యంలో తరించారు. శ్రీ సాయిబాబా టెంపుల్‌ సొసైటీ ఆఫ్‌ ఒహియో ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. మే 27 నుంచి మూడు రోజుల పాటు వేడుకగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. సుమారు వెయ్యి మంది భక్తులు భక్తి, శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైశాఖపూర్ణిమ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ పురోహితులు ఘంటశాల విద్యాధర శర్మ సారధ్యంలో వైదిక క్రతువులు జరిగాయి. 108 మంది మహిళలు సామూహిక శ్రీ సత్య వ్రతం ఆచరించారు. రెండో రోజున హోమం, నిధి కుంభపూజ, పూర్ణాహుతి నిర్వహించారు. అదే రోజున కుంకుమార్చన జరిగింది. చివరి రోజున వాస్తుహోమం, పూర్ణాహుతి జరిపారు.

మూడు రోజుల పాటు సాయినామ జపం, పారాయణం నిరంతరాయంగా కొనసాగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డెల్వేర్‌ దేశ కమిషనర్‌ టామీ థామ్సన్‌ హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని పేర్కొన్నారు. సాయిబాబాను ప్రతిష్ఠించే ప్రదేశంలో విశేష పూజలు జరిపారు. చిన్మయ మిషన్‌ శ్రీ బ్రహ్మచారి ప్రభోద్‌ చైతన్య సందర్శించి ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. 7.73 ఎకారాల్లో నిర్మితమవుతున్న సాయిబాబా ఆలయం ఉత్తర అమెరికాలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడిస్తుందని రమేష్‌ అడబాల చెప్పారు. సాయిబాబా టెంపుల్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ సత్య యర్రంశెట్టి, అధ్యక్షుడు తేజోమూర్తి, బ్రహ్మానందం శ్రీనివాస్‌,రామచంద్ర. ఆర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X