వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డల్లాస్ తెలుగు ఉత్సవాల్లో శ్రీశ్రీ నాటిక 'మరో ప్రపంచం'

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
డల్లాస్‌: తెలుగు సాహిత్య వేదిక తృతీయ వార్షికోత్సవంలో భాగంగా ప్రదర్శించిన శ్రీశ్రీ లఘనాటిక " మరో ప్రపంచం' ప్రవాసాంధ్రులను ఆకట్టుకుంది. స్థానిక ట్రినీటీ హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రవాసులు పాల్గొన్నారు. డా|| నరసింహారెడ్డి వూరమండి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి కళల ద్వారా ప్రవాసులు తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని టాంటెక్స్‌ అధ్యక్షులు చంద్ర కన్నెగంటి అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన వారికి టాంటెక్స్‌ కార్యదర్శి సురేష్‌ మండవ, డాక్టర్‌ రాఘవరెడ్డి, డాక్టర్‌ రమణారెడ్డి తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. వద్దిపర్తి పద్మాకర్‌ అష్టావధానం, ప్రతికా భాష, ఆవిర్భావం అనే అంశంపై నరిసెట్టి ఇన్నయ్య, 21వశతాబ్దంలో తెలుగు మనుగడ, ప్రజా కళ పత్రిక బృందం సమర్పించిన శ్రీశ్రీ 'మరో ప్రపంచం' లఘునాటిక మొదలైనవి సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

డాక్టర్‌ రాళ్లబండి కవితాప్రసాద్‌ రచించిన 'ఆముక్త మాల్యద' నృత్యరూపకం కూచిపూడి నృత్య దర్శకులు కేవీ సత్యనారాయణ దర్శకత్వంలో అద్భుతంగా ప్రదర్శింపబడింది. టాంటెక్స్‌ అధ్యక్షులు చంద్ర కన్నెగంటి, పూర్వాధ్యక్షులు ప్రసాద్‌ తోటకూర, డాక్టర్‌ నరసింహారెడ్డిలు ముఖ్య అతిథి కేవీ సత్యనారాయణని 'నాట్య కళా తపస్వి' బిరుదుతో సత్కరించారు. సంగీత బోధకులు రామాచారి సమర్పించిన 'సంగీత విభావరి' కార్యక్రమం ప్రేక్షకులను ఉత్తేజపరిచింది. టాంటెక్స్‌ ఉపాధ్యక్షులు ఎన్‌.ఎమ్‌.ఎస్‌.రెడ్డి, సంయుక్త కార్యదర్శి శేషారావులు రామాచారిని ఘనంగా సన్మాంచారు. ఈ కార్యక్రమంలో అనంత్‌ మల్లవరపు, రమణ జవ్వాది, విజయ్‌ చంద్రహాస్‌, సురేష్‌, రావు కల్వల, విజయలక్ష్మి అత్తలూరి, సుబ్బారావు పొన్నూరి, ప్రొఫెసర్‌ ప్రపంచం విజయవంతమవడానికి సహకరించిన వారందరికీ టాంటెక్స్‌ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X