డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్‌లో ఎన్నారై మిచిగాన్ తెలుగుదేశం కమిటీ సారథ్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశంతో రాష్ట్రంలో మారిన రాజకీయ చిత్రంపై వక్తలు ప్రసంగించారు. మండల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేట్టు చేశారని వారు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం, వారి ఆస్తిహక్కు కల్పించడం... తదితర విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్ర మహిళా లోకానికి ఆయన చేసిన సేవను వారు కొనియాడారు.
పటేల్,పట్వారీ, మునసబు, కరణాల వ్యవస్థలను రుద్ద చేయడంతో పాటు రెండు రూపాయలకు కిలోబియ్యం... తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్‌దేనని వారు తమ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం ప్రతినిధులు సూరపనేని బసవేంద్ర, దంతేశ్వరరావు, మోహన్, వెంకట్, ముద్దుకృష్ణ, సుధాకర్, బలరాం...తదితరులు పాల్గొన్నారు.