వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలంగాణ పాట జోష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nri
తెలంగాణా సాధించడమే ప్రధమ లక్ష్యంగ ఏర్పడిన బేఏరియా తెలంగనైట్స్ నిర్వహించిన్న తెలంగాణ జాపదుల వేడుక శనివారం రాత్రి కాలిఫోర్నియాలో మహా వైబవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి బే ఏరియా లోని జైన మందిర్ వేదికగా నిలిచింది.ఆడిటోరియం అంత తెలంగాణా చారిత్రక కట్టడాలు అయిన వరంగల్ వేయి స్థంబాలు,చార్మినార్ ,మెదక్ చర్చి మొదలయినవి...., దేవాలయాలు వేములవాడ, సమక్క-సారక్క జాతర, యాదగిరి గుట్ట వంటివి...సంస్కృతి సంప్రదాయాలు అయిన బోనాలు, పోతరాజు, బతుకమ్మ లాంటి చిత్ర పటాలాతో అలంకరించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబించారు.

స్వాగత ఉపన్యాసం తో మొదలయిన ఈ వేడుక సాయంత్రమంత ఆహ్వానితులకు పసందుగా విందు చేసింది.చిన్నారులు పాడిన గణేశ భక్తి గీతంతో సంస్కృత కార్యక్రమం మొదలయి ప్రేక్షక్కులకు మరపు రాణి అనుభూతిని మిగిల్చింది. తెలంగాణ జానపదాలే ముఖ్యాంశంగా కొనసాగిన ఈ కార్యక్రమం లో దాశరథి, సురవరం ప్రతాప రెడ్డి, డాక్టర్ అందెశ్రీ, గూడ అంజన్న, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి వంటి మరి ఎందరో తెలంగాణ మేధావులను, కవులను, వారి జానపద రచనలను గుర్తు చేసుకునారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులగా వచ్చిన ప్రముక జానపద గాయకుడు, 'మా టీవీ' సూపర్ సింగర్, 'రెహ్ లా రెహ్' ఫేం శివనాగులు గారు జానపదాల తో మైకుల ను హోరెత్తించారు. తెలంగాణ పల్లె సీమలను తలిపిస్తూ వాటి సంస్కృత వైభావాన్ని చాటిచేపుతూ ఆయన పాడిన జానపదాలకు చిన్న పెద్ద అందరు ఆయనతో గళం కలిపి చిందులు వేసారు. ఆయన ఎన్నో ప్రముఖ జానపదాలు పాడి అందరిని ఉర్రూతలూగించారు, ముఖ్యంగా ఆయన పాడిన పాటల్లో అందరిని ఆకటుకున్న పాట 'కోడి పాయ లచమ్మ', వన్స్ మోర్ అన్న పాట 'మాయదారి మైసమ్మ.

చిన్నారులు చేసిన కూచిపూడి, 'ఎలా ఎలా ఎలా ఎలా' నృత్యాలు, పాడిన 'జయ జయహే తెలంగాణా' ఇతరులు పాడినా 'లాలు దర్వాజా లష్కర్', గిటార్ వాద్యం, ఐడియస్ ఆన్ లైన హాస్య నాటకం, భోజన విరామ సమయంలో ప్రదర్శించిన తెలంగాణా చారిత్రక కట్టడాలా చిత్ర ప్రదర్శన కార్యక్రమనకి కొస మెరుపుగా నిలిచాయి. బేఏరియా తెలంగనైట్స మంచి ఆటా పాటనే కాకుండా విరామ సమయంలో అతిదులన్దరికి సంప్రదాయ వంటలతో భోజనం వడ్డించి అందరి మన్ననలు పొందారు.

చివరగా కళాకారులను బహామతులతో సత్కరించి, కళాకారులకి, స్పాన్ సార్స్ కి, వాలంటిరిస్ కి, అతిదులకి 'వోట్ అఫ్ థాంక్స్'తో కార్యక్రమం ముగించారు. ఇపుడే మొదలయి ఆపుడే అయిపోయిందా అన్నట్టుగా ఈ సాంస్కృత కార్యక్రమం అంత చివరి వరకు ఎంతో కోలాహలం, సందడి, సంబరంతో జోష్ జోష్ గా కోనసాగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X