వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో వేటూరి సంస్మరణ సభ

By Santaram
|
Google Oneindia TeluguNews

Veturi Sundaramurthy
టెక్సాస్: తెలుగు సినీ మహాకవి వేటూరి సుందరరామమూర్తి సంస్మరణ సభ ఇటీవల అమెరికాలో జరిగింది. ఉత్తర డల్లాస్ తెలుగు సినిమా ప్రియులు అయిదవ “వెండి తెర వేదిక" సమావేశాన్ని తోటకూర ప్రసాద్ గారి అధ్యక్షతన రిచర్డ్సన్ లోని ఫనేషియా థీయేటర్స్ లో ఈనెల 6వ తారీఖున నిర్వహించుకున్నారు.

ముందుగా తోటకూర ప్రసాద్ వేటూరితో తనకున్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. వేటూరికి ఆయన స్వంత ఊరు పెద్దకళ్ళేపల్లి (కృష్ణాజిల్లా) పై, కృష్ణవేణి తీరప్రాంతంపై, తెలుగుభాషపై ఉన్న ప్రగాఢమైన అనుబంధాన్ని వివరించారు. తరువాత 2005లో తాను వేటూరితో చేసిన ఇంటర్వ్యూ కొన్నిభాగాలు వినిపించారు.

అనంతరం మద్దుకూరి విజయచంద్రహాస్, రమ్యమైన శైలి, అద్భుతమైన భాషాపటిమ, సంప్రదాయ గేయ జానపద సాహిత్యాలపై పట్టు, సన్నివేశాలకు పాత్రల స్వభావాలకు బలంచేకూర్చి శ్రోతలను అలోచింపచేయగల రచనాశక్తి, సర్వతోముఖప్రతిభ, అనాయాసంగా, అలవోకగా వెల్లువైన పాటల సృష్టి వంటి లక్షణాలు సోదాహరణంగా వివరించి వేటూరిగారి విశిష్టతకు కారణాలుగా అభివర్ణించారు.

తరువాత కలపటపురమేశ్, మల్లవరపు అనంత్, సప్తపది, అడవిరాముడు, గీతాంజలి సినిమాలలోని వేటూరి గీతాలాలపించారు. సభకు వచ్చినవారందరూ వేటూరిగారి గురించి వారివారి ఆలోచనలు పంచుకుని ఆయన స్మృతికి నివాళి అర్పించారు. చివరగా ఎమ్వీయల్ ప్రసాద్ గారి వందన సమర్పణతో సభముగిసింది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X