వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్ లో ఘనంగా ఉగాది వేడుకలు

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
న్యూయార్క్: న్యూయార్క్‌ తెలుగు సాహిత్య, సాంస్కృతిక కమిటీ(టీఎల్‌సీఎ) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు స్ధానిక గణేష్‌ ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సత్య ప్రదీప్‌, సాధన పరంజిలు చేసిన నృత్య రూపకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. టీఎల్‌సీఏ అధ్యక్షులు శివకుమార్‌ కమిటీ నూతన సభ్యులను, ఛైర్‌ పర్సన్‌ జానకీరావును సభకు పరిచయం చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ ప్రదర్శించిన వారికి డాక్టర్‌ దత్రాత్రేయ, మల్లా రెడ్డి, రాజేశ్వరీ రావు అనుమోలు, మహాలక్ష్మి, సాంబశివరావు వెనిగళ్ల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంత కావడానికి సహకరించిన వారందరికీ కమిటీ కార్యదర్శి విక్రమ్‌ జనగాం కృతజ్ఞతలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X