వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ టాయ్స్‌తో కస్టమ్స్‌కు చిక్కిన ఎన్నారై మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Airport
ముంబై విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో బాలీవుడ్ తారలు కస్టమ్స్ అధికారులకు చిక్కడం మామూలు వ్యవహారంగా మారింది. విలువైన సంచులు, లెక్క లేని ఆభరణాలు, తదితర వస్తువులతో వారు పట్టుబడ్డారు అయితే, సోమవారంనాడు ఓ యాభై ఏళ్ల ఎన్నారై మహిళ సెక్స్ టాయ్స్‌తో ముంబై విమానాశ్రయంలో పట్టుబడింది. ఆమె వద్ద నిషేధిత సెక్స్ టాయ్స్, ఖరీదైన లింగరీ, సిడిల్లో కింకీ గేమ్స్, ఆరు లక్షల రూపాయల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వారు గుర్తించారు.

గ్రీన్ చానెల్ దాటుతుండగా ఆమెను పట్టుకున్నారు. ఆమెను బచ్చూ భాయ్‌గా గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం ఆమెను ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్‌కు అప్పగించారు. వ్యక్తిగత వాడకానికి మాత్రమే తాను వాటిని తెచ్చుకున్నానని, సెక్స్ టాయ్స్ వంటివి తీసుకురావడం నిషిద్ధమని తనకు తెలియదని ఆ మహిళ చెప్పింది. తాను అమెరికాలో ఉంటున్నట్లు, కూతురు పెళ్లి కోసం తాను ముంబై వచ్చినట్లు తెలిపింది. ఆమె వద్ద వస్తువులను స్వాధీనం చేసుకుని ఆమెను వదిలిపెట్టినట్లు అధికారులు చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం ఆమెను పిలుస్తామని చెప్పారు.

English summary
In the last few months, many celebrities have been caught at the international airport with undeclared goods. While some carried branded goods like high-end purses, shoes and bags, others tried to walk through the green channel with undeclared jewellery. However, on Monday it was the turn, not of a celebrity, but of a 50-year-old NRI woman to be intercepted by the Mumbai Customs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X