వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం, తెలుగు విద్యార్థుల గోల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tri Valley University
యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికాలో మరోసారి తెలుగు విద్యార్థులు రోడ్డున పడ్డారు. ట్రైవ్యాలీ యూనివర్శిటీ తర్వాత మరో విశ్వవిద్యాలయం గుట్టు రట్టయింది. యుఎస్ఐలోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ వర్జీనియాలో అక్రమాలు జరిగినట్లు ఫెడరల్ అధికారులు జరిపిన తనిఖీలలో తేలింది. యూనివర్శిటీలో అక్రమాలు జరిగినట్లు భావించిన ఫెడరల్ అధికారులు నార్త్ వర్జీనియాపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అనుమతుల కంటే ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తేలింది. దీంతో అధికారులు విశ్వవిద్యాలయాన్ని లాకౌట్ చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఈ విశ్వవిద్యాలయంలో చదివే వారిలో అధిక సంఖ్యాకులు మన దేశం వారే. అందులోనూ తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. విశ్వవిద్యాలయంలో చదివి రోడ్డున పడ్డ విద్యార్థులను వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు. లేదంటే మరో విశ్వవిద్యాలయంలో చేరాలని సూచించారు. అయితే ఇప్పటికిప్పుడు మరో విశ్వవిద్యాలయంలో చేరడానికి అవకాశం లేదు.

దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో బాధితులు ఉన్నారు. విశ్వవిద్యాలయం మూతబడినప్పటికీ విద్యార్థుల నుండి వసూలు చేసిన భారీ డబ్బును యాజమాన్యం విద్యార్థులకు ఇవ్వలేదు. మరో విషయం ఏమంటే ఇందులో చేరిన వారిలో అధిక శాతం ట్రైవ్యాలీ యూనివర్శిటీ బాధితులే కావడం గమనార్హం. కాగా బాధిత తెలుగు విద్యార్థులకు నాటస్ అనే తెలుగు సంస్థ సహకరించడానికి ముందుకు వచ్చింది. బాధితులు నాటస్‌ను ఆశ్రయిస్తే వారికి చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవలే అమెరికాలోని ట్రైవ్యాలీ యూనివర్శిటీలో కూడా లిమిట్ కంటే ఎక్కువ మంది ఉండటంతో ఆ యూనివర్శిటీ సైతం మూత పడింది. అందులోనూ తెలుగు విద్యార్థులే అధికంగా ఉన్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయల ఎన్నిక విషయంలో పకడ్బందీగా లేక పోవడంతో మన వారే ఎక్కువగా బాధితులు అవుతున్నారు.

English summary
Another University came out like Tri valley University in America. Telugu students thrown on roads due to the closure of the University of North Virginia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X