ప్రపంచ కప్ గెలుచుకున్న టీమిండియాకు తెలుగు ఎన్నారైలు అభినందనలు తెలుపుతున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) భారత క్రికెట్ జట్టు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపింది. తాము టీమిండియాకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, భారత దేశ గౌరవాన్ని టీమిండియా సభ్యులు ఉన్నత శిఖరాలకు చేర్చారని, ఈ విజయం ఏళ్ల తరబడి ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఆటా అధ్యక్షుడు రాజేందర్ జిన్నా అన్నారు.
ఫైనల్ మ్యాచులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీకి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్న యువరాజ్ సింగ్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ యావత్తూ టీమిండియా చూపిన అద్భుతమైన ఆటతీరును, ముఖ్యంగా ఫైనల్లో ఇచ్చిన ప్రదర్శనను ఆయన అభినందించారు.
On behalf of American Telugu Association members the President of ATA, Dr. Rajender Jinna conveys, “our heartiest congratulations to Team India, you have raised the level of Indian Nation Pride and the victory will be echoed for years to come”.
Story first published: Monday, April 4, 2011, 10:09 [IST]