వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైల క్రికెట్ క్రీడా సౌరభం

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో డెలావేర్, ఫిలడెల్ఫియా ఏరియాలో ఆటా ప్రతినిధులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో క్రికెట్ మ్యాచులు, విందు కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రాంతంలో ఆటా కార్యక్రమాలు గత 20 ఏళ్లలో మొదటిసారి జరిగాయి. విల్మింగ్టన్‌లోని బోంపాల్ పార్కులో నిర్వహించిన క్రికెట్ మ్యాచులో 14 జట్లు పాల్గొన్నాయి. దాదాపు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్ి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. వీరికి తోడుగా చిన్నారులు కూాడ పాల్గొని తమ తమ తండ్రులకు మద్దతిచ్చారు. మొత్తం 20 జట్లు నమోదు చేసుకోగా, సమయం చాలకపోవడంతో ఐదు జట్లు వెనుదిరగాల్సి వచ్చింది. ఆటా నిర్వాహకులు తదుపరి నిర్వహించే మ్యాచుల్లో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

శనివారం సాయంత్రం మేరియాట్ హోటల్లో జరిగిన విందులో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని వివిధం ప్రాంతాల నుంచి వచ్చిన ఆటా కార్యవర్గ సభ్యులను, ఇతర కమిటీ సభ్యులను కులుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, కార్యదర్శి రామ్మోహన్ కొండ, కార్యవర్గ సభ్యులు పర్మేష్ భీంరెడ్డి, సుధాకర్ పెర్మారి, బలవంత్ కొమ్మిడి, సురేష్ జిల్లా, వినోద్ కోడూరు, భువనేష్ బూజల, రాజేష్ మాదిరెడ్డి పాల్గొన్నారు.

ఆదివారం జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచులో చాలెంజర్ టీమ్ ఛాంపియన్‌షిప్ దక్కించుకుంది. చేజ్ ఎలెవన్ టీం ద్వితీయ స్థానం దక్కించుకుంది. మొదటి స్థానం దక్కించుకున్న జట్టుకు డాక్టర్ జిన్నా, రెండో స్థానం దక్కించుకున్న జట్టుకు స్థానిక ప్రముఖ హార్జ్ సర్జన్ చంద్రశేఖర రెడ్డి బీసం ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఆటా ప్రాంతీయ సమన్వయకర్తలు ఉదయ్ కిరణ్ కొమ్మిరెడ్డి, మాధవ మోసర్ల ఆధ్వర్యంలో స్థానిక ఆటా బోర్డు సభ్యుడు పర్మేష్ భీంరెడ్డి సూచనలతో విజయవంతంగా నిర్వహించారు.

తమకు సహాయసహకారాలు అందించిన ప్రశాంత్ గుడుగుంట్ల, కిరణ్ ఆలా, శ్రీవివాస్ కేశవరపు, శ్రీధర్ బొల్లెద్దుల, కమల్ నెల్లుట్లలకు ఉదయ్, మాధవ్ కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన వెంకటరావు మదిపగాడను జిన్నా ప్రత్యేకంగా అభినందించారు.

English summary
American Telugu Association (ATA) event was held in the region of Delaware and Philadelphia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X