వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటా మెంబర్ అప్రిషియేషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) వాషింగ్టన్ డిసి చాప్టర్ ఈ నెల ఐదవ తేదీన వర్జీనియాలో మెంబర్ అప్రిషియేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వర్జీనియా, వాషింగ్టన్ డిసి, మేరీల్యాండ్, బల్తీమోర్, పరిసర ప్రాంతాల్లోని తెలుగు కుటుంబాలు ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున హాజరయ్యాయి. ఆటా అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, ప్రధాన కార్యదర్సి రాంమోహన్ కొండా ఇతర సీనియర్ సభ్యులుతో పాటు హాజరయ్యారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ యుఎస్ కరస్పాండెంట్ లలిత్ కె. ఝా, ఎహెచ్ఎన్ మీడియా కార్ప్ వైట్ హౌస్ కరస్పాండెంట్ తేజిందర్ సింగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమానికి వచ్చారు.

మెట్రో ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ సౌమ్య కొండపల్లి స్వాగతం చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఆటా చేస్తున సేవలను, సాధించిన ఫలితాలను సౌమ్య వివరించారు. ఉత్తర అమెరికాలో, భారత్‌లో ఆటా సభ్యులు, ఇతరులు చేసిన సేవలను ఆమె ఉదహరించారు. ఆటా నిర్వహించిన వివిధ కార్యక్రమాలను కూడా ఆమె వివరించారు. తెలుగు సంస్కృతిని ప్రోత్సహించడానికి, తెలుగు సమాజాన్ని ఏకం చేయడానికి తమ సంఘంలో చేరాలని ఆమె పిలుపునిచ్చారు. ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మోసాలకు గురైన భారత విద్యార్థులను తాము ఆదుకున్న తీరును మేరీలాండ్‌కు చెందిన ఆనంద్ బాబు గుమ్మడి వివరించారు. ఆటా న్యాయపరమైన సహాయాన్ని అందించడంలో, ఇతర విషయాల్లోనూ ముందుకు వచ్చినందుకు కృతజ్ఋతుల తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రాంతీయ సమన్వయకర్తలను, సభ్యులను అధ్యక్షుడు డాక్టర్ జిన్నా అభినందించారు. వాషింగ్టన్ డిసి చాప్టర్ ఆటా ట్రస్టీలు భువనేశ్వర్ బూజాలా, రాజేష్ మాదిరెడ్డి తమకు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా వేసిన ప్రశ్నలకు డాక్టర్ జిన్నా, జయేందర్ అన్నం, రామ్ మోహన్ కొండా సమాధానాలిచ్చారు. పిల్లల వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. లక్ష్య, రచన, శ్రేయ, సాహితి, సంజన, సంహిత, వివేక్, చేతన్ బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు నృత్యాలు చేశారు. మేఘన, శైలజ భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు. మేధ వాయిలెన్‌పై జెెస్ బాచ్ కంపోజిషన్ ప్రదర్శన ఇచ్చింది. శ్రేయ తెలుగు సినీ గేయాన్ని ఆలపించింది. డిజె సన్నీ ఈ కార్యక్రమాలకు సహకరించారు. వర్జీనియా ప్రాంతీయ సమన్వయకర్త మనోహర్ ఎనుగు వందన సమర్పణ చేశారు.

English summary
Washington DC Chapter of American Telugu Association (ATA) hosted Member Appreciation Event on March 5th, 2011 in Virginia. The event was organized to express gratitude to all members in the Washington DC metro area for their continued support to ATA and to outline ATA future plans in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X