వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైల గోల్ఫ్ టోర్నమెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అమెరికా చారిటీ సంస్థ బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ కోసం నిధులు సేకరించడానికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆదివారంనాడు వార్షిక గోల్ఫ్ టోర్నమెంటును నిర్వహించింది. ఈ టోర్నమెంటులో 12 జట్లు పాలు పంచుకున్నాయి. ఆటా డిఎఫ్‌డబ్ల్యు ప్రాంతీయ సమన్వయకర్తలు అరవింద్ రెడ్డి ముప్పిడి, సురేష్ రెడ్డి గొట్టి ముక్కల జట్లకు స్వాగతం పలికారు. షాట్ గన్ ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్ జరిగింది. గ్రేప్ వైన్ గోల్ఫ్ కోర్సు డైరెక్టర్ వాల్టర్ గ్రీన్ ఆటా కృషిని ప్రశంసించారు. జెపి రెడ్డి, బాజి ఈడ్పుగంటి, శ్రీధర్ కంచర్ల, నరేందర్ గవ్వా జట్టు విజయం సాధించింది. విక్రం రెడ్డి, సురేష్ శంకర్, రవి గంపల, శ్రీనివాస్ రావోల జట్టు రెండో స్థానంలో నిలిచింది. మహేష్ ఆదిభట్ల, కిరణ్ చిట్టూరి, పవన్ ఆకుల, నిక్ రిచర్జ్స్ బాజి ఈడ్పుగంటి జట్లు లాంగెస్ట్, షార్టెస్ట్ డిస్టాన్స్ పోటీలను గెలుచుకున్నాయి.

ఈవెంట్ ప్రధాన స్పాన్షరర్, స్పీచ్ సాఫ్ట్ సొల్యూషన్ ప్రతినిధి జెపి రెడ్డి ఆటా సేవాదృక్పథాన్ని ట్రోఫీల ప్రదానం సందర్భంగా కొనియాడారు. వసూలైన మొత్తాన్ని జెపి రెడ్డి, వెంకట రెడ్డి ముంచింతల బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ విపి డాన్ స్టుచాల్‌కు అందించారు. ఆటా బోర్డు సభ్యుడు సతీష్ రెడ్డి - సత్య సాయి బాబా చేసిన సేవలను గుర్తు చేశారు. ఆటా సంయుక్త కార్యదర్సి అనంత రెడ్డి పజ్జూరు వందన సమర్పణ చేశారు. చారిటీ గోల్ఫ్ టోర్నమెంటును ఆటాకు చెందిన అరవింద్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అనంత్ పజ్జూరు, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డి, రాజ్ ఆకుల, సుధీర్ గూడ, భాను ప్రసాద్ రెడ్డి, రామ్ అన్నడి, అశోక్ చిట్టిప్రోలు, సీలం రెడ్డి, సురేష్ పుల్వల, వంశి చామల నిర్వహించారు.

English summary
American Telugu Association (ATA) hosted its Annual Charity Golf Tournament on Sunday April, 24th 2011, at the famous Grapevine Golf Course, Grapevine, TX. The tournament was organized as a sole purpose to raise funds for US based charity organization Big Brothers Big Sisters and all the proceeds from the event were to support their noble cause.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X