వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోస్టన్‌లో తెలంగాణ నైట్

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తెలంగాణ ఎన్నారై సంఘం (తెనా) బోస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఐదో బోస్టన్ తెలంగాణ నైట్ జరిగింది. బోస్టన్ మెట్రో ఏరియా నుంచి ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నారైలు పెద్ద యెత్తున వచ్చారు. దాదాపు 500 మంది దాకా ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరిలో తెలంగాణేతరులు కూడా ఉన్నారు. న్యూ ఇంగ్లాండు, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, న్యూయార్క్‌ల నుంచి తెలంగాణ ఎన్నారైలు వచ్చారు. రితిక, సూరినేని గణేశ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. తెనా సీనియర్ సభ్యుడు పాపారావు గుండవరం స్వాగతం చెప్పారు. గీతాంజలి కమిల్ల, వర్ష బియ్యాల కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించారు.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రదర్శనలను పిల్లలు, పెద్దలు ఇచ్చారు. యువేన్, గాయత్రి, వంశీకృష్ణ, ప్రినిక, అనీషా, ఆషిఖ్ జానపద నృత్యాలు అందరినీ అలరించాయి. ఆలోక్ మాచెర్ల అసైదులా హారతి పాటకు నృత్యం చేశాడు. పవన్ కొండోజు, మధు పురుషోత్తం, వెంకట్ మాచెర్ల, అమర్ కమిల్ల, రమేష్ దదిగల నృత్యం కూడా విశేషంగా ఆకట్టుకుంది. జయ జయహే తెలంగాణ పాట నుంచి జై బోలో తెలంగాణ మీదుగా పొడుస్తున్న పొద్దు మీద పాటతో పూర్తయింది. తెలంగాణ ఉద్యమ గీతానికి యషిత, మేధ, రిషిక, రితిక, ప్రగతి, జాగృతి నృత్యం చేశారు.

తెనా బోస్టన్ చాప్టర్ తొలిసారి తెలంగాణ పత్రిక తంగేడును ప్రచురించింది. ఈ పత్రికను లక్ష్మా రెడ్డి ఆవిష్కరించారు. గత నవంబర్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన డాక్టర్ ఒమర్ ఖలీదీకి సంతాపం ప్రకటించారు. తెనా చైర్మన్ రవి మేరెడ్డి తెలంగా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సహకరిస్తున్నవారికి కృతజ్ఢతలు తెలిపారు. రవి మేరెడ్డి, పురుషోత్తం రాజు, వెంకట్ రెడ్డి ముద్దసాని, శ్రీనివాస్ మేనేని బహుమతులు ప్రదానం చేశారు.

English summary
Telangana NRI Association (TeNA) Boston Chapter celebrated its flagship annual event, “5th Boston Telangana Night” on May 21, 2011, Saturday in the historic city of Lexington, Massachusetts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X