వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఎన్నారైల దండి యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Nri
అవినీతికి వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు అమెరికాలో దండియాత్ర - 2 చేపట్టారు. యాత్ర సందర్భంగా సాన్ డీగో వద్ద గల మార్టిన్ లూథర్ కింగ్ పార్కులో వారంతా సమావేశమయ్యారు. మహాత్మాగాంధీ వేషధారి ముందు రాగా మరో 30 మంది ఆయనను అనుసరించారు. ఇది మార్చి 12వ తేదీ ఉదయం 8 గంటలకు జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా 240 మైళ్ల దండియాత్ర -2 పేర పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. జాతీయ గీతాలాపన తర్వాత యాత్రలో పాల్గొనడానికి గల స్ఫూర్తిని పీపుల్ ఫర్ లోక్ సత్తా (పిఎఫ్ఎల్) సభ్యులు శ్రీహరి అట్లూరి, జవహర్ కంభంపాటి, సుభాష్ కర్రి, వర్మ దంతలూరి తమ అనుభవాలను పంచుకున్నారు. ఇండియా నుంచి వచ్చిన దైనిక్ ఛత్తీస్‌ఘడ్ సంపాదకుడు సునీల్ కుమార్ ఆ యాత్రకు సంబంధించిన వార్తను సేకరించడానికి వచ్చారు.

1930 మార్చి 12వ తేదీ మహాత్మాగాంధీ దండియాత్రను నిర్వహించారు. దాని స్ఫూర్తిగా ఎన్నారైలు అవినీతికి వ్యతిరేకంగా దండియాత్ర - 2ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలో 12 నగరాల్లో, భారతదేశం వెలుపల 20 నగరాల్లో ఈ యాత్ర జరుగుతుంది. సీనియర్ పౌరులు గాంధీ చేపట్టిన మార్గంలోనే గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు యాత్ర చేస్తారు. రాజకుమార్ సింగ్ నాయకత్వం వహించే ఈ యాత్ర ఏప్రిల్ 6వ తేదీన దండి చేరుకుంటుంది. చిన్నపాటి ఉప్పు సంచులను పార్లమెంటు సభ్యులకు బట్వాడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో దాదాపు వంద మంది సమావేశమై దండియాత్ర - 2 విజయవంతం కావాలని ప్రార్థించారు.

English summary
At 8 am on March 12th, an interesting event took place at Martin Luther King Jr. Park at San Diego, USA. A 78-year old man, attired to be a lookalike of Mahatma Gandhi arrived. He was accompanied by 30 others, wearing T-shirts with Gandhi’s famous silhouette and the caption: Dandi March II – A 240 Mile Walk Against Corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X