వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాకు మద్దతు, చేతులకు సంకెళ్లతో నిరసన

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నా హజారేను, ఆయన అనుచరులు కిరణ్ బేడి తదితరులను అరెస్టు చేసినందుకు నిరసనగా అమెరికాలో నిరసన పెల్లుబుకింది. పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా అధ్వర్యంలో అమెరికాలోని ఎన్నారైలు చేతులకు సంకెళ్లు వేసుకుని స్వయం అరెస్టును ప్రకటించుకున్నారు. కాలిఫోర్నియా, అట్లాంటా, హూస్టన్, బోస్టన్ వంటి పలు ప్రాంతాల్లో ఎన్నారైలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీని వారు బ్లాక్ డేగా పరిగణించారు.

అన్నా హజారేను అరెస్టు చేయడాన్ని వారు గాంధేయాన్ని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను అరెస్టు చేయడంగా అభివర్ణించారు. అన్నా హజారేను అరెస్టు చేసి తీహార్ జైలులో పెట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అన్నా హజారే అరెస్టును వారు మాయని మచ్చగా వారు వ్యాఖ్యానించారు. ఆధునిక గాంధీ అన్నా హజారే పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును వారు నిరసించారు.

English summary
In support of anna hazare ,and arresting Anna hazare ,NRIs compared this incident as “Arresting Human rights” and “Arresting the democracy” NRIs in USA wearied “Hand –cuffs” and self arrested themselves as a symbolic representation of arresting democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X