• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్నాకు అమెరికాలోని భారత విద్యార్థుల మద్దతు

By Pratap
|

Anna Hazare
సామాజిక కార్యకర్త అన్నా హజారేకు, అవినీతికి వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న ఉద్యమానికి మద్దతుగా అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారత విద్యార్థులు ముందుకు వచ్చారు. దాదాపు 35 మంది విద్యార్థులతో కూడిన ప్రతినిధి బృందం ఆదివారంనాడు వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయానికి చేరుకుని ఓ వినతిపత్రం సమర్పించారు. భారత రాష్ట్రపతికి రాసిన లేఖను భారత దౌత్యాధికారులకు అందించారు.

భారత పౌరులుగా తాము భారత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని వారన్నారు. అవినీతిని అరికట్టకపోతే భారత పౌరులుగా తమ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నట్లేనని, ఈ స్థితిలో ప్రభుత్వం పాలించే హక్కును కోల్పోయిందని వారన్నారు.

అమెరికాలోని వివిధ కాన్సులేట్లలో కూడా విద్యార్థులు ఇదే విధమైన వినతిపత్రాలను సమర్పించారు. వివిధ సోషల్ నెట్‌వర్గింక్ సైట్ల ద్వారా హజారేకు మద్దతు కూడగట్టడానికి ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఐఐటి పూర్తి చేసి మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేస్తున్న అశుతోష్ గుప్తా ప్రయత్నిస్తున్నారు.

English summary
Indian students studying in various American Universities have come in strong support of social activist Anna Hazare and his protest against corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X