వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుకెలో ఎన్నారైల బక్రీద్ ప్రార్థనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
ఎన్నారై తెరాస యుకె విభాగం ఆధ్వర్యంలో లండన్‌లోని హౌన్‌స్లో ఇస్లామిక్ సెంటర్‌లో బక్రీద్ ప్రార్థనలు జరిగాయి. ముస్లింలకు ఎన్నారైలు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగాలకు సంబంధించిన పండుగ అని, త్యాగాల ద్వారా భగవంతుడని సంతోషపెట్టడం ఇందులో ఇమిడి ఉందని, ఆ సంతోషం మానవుడిని రక్షిస్తుందని ఎన్నారై తెరాస విభాగం యుకె విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. తెలంగాణకోసం వందలాది మంది ప్రాణత్యాగం చేశారని, అయినా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. ప్రాణత్యాగాలను ఆపడానికి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు.

తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నందుకు ఆయన ముస్లింలకు అభినందనలు తెలిపారు. తెరాసను, ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మద్దతు ఇస్తున్నందుకు ఆయన కృతజ్ఢతలు తెలిపారు. తెరాస పిడి యాక్ట్ కింద తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌ను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బలవంతంగా ఆస్పత్రికి తరలించడాన్ని కూడా ఆయన ఖండించారు. ఎన్నారై తెరాస సభ్యులు ఆరాఫత్, పాషా, కాంతి రమేష్, దూసరి అశోక్, ఊరుగొడ మహేష్, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
NRI TRS CELL- UK team offered prayers at Hounslow islamic centre, London on the occasion of Bakrid and extended their Bakrid day greetings to Muslim people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X