వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా రామ్‌దేవ్‌కు ఎన్ఆర్ఐల మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
విదేశాలలో ఉన్న నల్లధనాన్ని దేశానికి తెప్పించి జాతీయ సంపదగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. పీపుల్ ఫర్ లోక్ సత్తా(పిఎఫ్ఎల్) సంస్థ బాబా దీక్షకు మద్దతు ప్రకటించింది. భారత్ స్వాభిమాన్ ట్రస్టుతో కలిసి హోస్టన్‌కు చెందిన పిఎల్ఎఫ్‌ కార్యకర్త హైమా సాగి బాబా దీక్షకు మద్దతు ప్రకటించారు. ఇరు సంస్థలు కలిసి బాబా దీక్ష ప్రారంభించిన జూన్ 4న యుఎస్ఏలోని హోస్టన్, న్యూజెర్సీ, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

బ్రిటీష్ వాళ్లు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి రెండు వందల కోట్ల రూపాయలకు మించి లూటీ చేయలేదని కానీ ఆరవయ్యేళ్లలో పదిహేను వందల బిలియన్ డాలర్లను భారత్‌ను పాలిస్తున్న వారు లూటీ చేశారని న్యూజెర్సీకి చెందిన ప్రకాశ్ కపిలా ఆరోపించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఎన్ఆర్ఐ కూడా అన్నాహజారే జన్ లోక్‌పాల్ బిల్లుకు, బాబా రామ్ దేవ్ నల్లడబ్బు వెనక్కి తెప్పించే ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని కోరారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఉద్యమంలో భాగంగా 2జి కుంభకోణానికి వ్యతిరేకంగా పిఎఫ్ఎల్ కిల్ కరెప్షన్ పేరిట ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల జన్ లోక్‌పాల్ బిల్లుకు మద్దతుగా పిఎఫ్ఎల్ 240 మైల్స్ దూరం దండి మార్చ్ నిర్వహించినట్టు చెప్పారు.

కాగా న్యూఢిల్లీలోని బాబా రామ్‌దేవ్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసి హరిద్వార్ పంపించింది. న్యూఢిల్లీలో బాబాపై దొమ్మీ కేసు పెట్టింది. 15 రోజుల పాటు బాబా న్యూఢిల్లీ రాకుండా ఆంక్షలు విధించింది. అయితే హరిద్వార్ చేరుకున్న బాబా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్టు ప్రకటించారు.

English summary
People for Lok Satta (PFL), a non profit political organization, whichwas fighting against corruption from its Inception, is extendingsupport to Baba Ramdev’s fast against black money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X