వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరికి రేడియో ట్యాగ్స్ తొలగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri-Valley University
వాషింగ్టన్‌: ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం వీసా మోసాల కేసులో ఇద్దరు భారతీయ విద్యార్థులకు రేడియో ట్యాగుల్ని తొలగించారు. న్యాయవాది కల్పన పెద్దిభొట్ల ఇద్దరు విద్యార్థులను ఇమిగ్రేషన్‌, కస్టమ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) కార్యాలయానికి తీసుకెళ్లి రేడియో ట్యాగుల్ని తొలగింపజేశారని శాన్‌ఫ్రాన్సిస్కో భారత దౌత్య కార్యాలయంలోని కాన్సుల్‌ జనరల్‌ సుస్మితా గంగూలీ థామస్‌ తెలిపారు. ఆ విద్యార్థులు, న్యాయవాది తాము నిర్వహించిన ఉచిత న్యాయ శిబిరానికి హాజరయ్యారని వెల్లడించారు. వచ్చేవారం కల్పన మరికొంత మందినీ అమెరికా అధికారుల వద్దకు తీసుకెళ్తారని చెప్పారు.

ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు చేరిన విషయం తెలిసిందే. అందులోనూ తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. వీసా అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలపై అమెరికా అధికారులు ఆ విశ్వవిద్యాలయాన్ని మూసేశారు. అంతేకాకుండా, భారతీయ విద్యార్థులను అనుమానిస్తూ వారికి రేడియో ట్యాగులను అమర్చారు. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

English summary
Radio tags for two Indian students of Tri - Valley university were removed. It was informed by Indian consulate General Ganguly Thomas. Lawyer Kalpana Peddibhotla took the pain to remove the radio tags to the students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X