వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిడ్నీలో ఎన్నారైల గణేశ ఉత్సవాలు

ఆస్ట్రేలియా తెలంగాణ వేదిక ఆధ్వర్వంలో గణేశ ఉత్సవాలు జరిగాయి. మట్టి వినాయకుడిని నెలకొల్పి పిల్లలు, పెద్దలు గణేశ ఉత్సవాలు నిర్వహించారు. హిందూ పూజారి నేతృత్వంలో మొదటి రోజు పూజలు జరిగాయి. గణేశ మండపాన్ని కొ

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియా తెలంగాణ వేదిక ఆధ్వర్వంలో గణేశ ఉత్సవాలు జరిగాయి. మట్టి వినాయకుడిని నెలకొల్పి పిల్లలు, పెద్దలు గణేశ ఉత్సవాలు నిర్వహించారు. హిందూ పూజారి నేతృత్వంలో మొదటి రోజు పూజలు జరిగాయి. గణేశ మండపాన్ని కొబ్బరి ఆకులతో, షుగర్ కేన్ ఆకులతో అలంకరించారు. పూజకు 225 మంది హాజరయ్యారు. ఆ తర్వాత గణేశుడిని ఊరేగింపుగా పారమట్టా నదికి తీసుకుని వెళ్లారు. వినాయకుడి లడ్డును వేదిక కోశాధికారి వాణి ఏలేటి వేలం వేశారు. ఇది 335 డాలర్లు పలికింది. ఆస్ట్రేలియా తెలంగాణ వేదిక మీడియా సంబంధాల ప్రతినిధి డాక్టర్ వినోద్ రెడ్డి ఏలేటి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

NRI

తెలంగాణ సకల జనుల సమ్మె విజయవంతం కావాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కావాలని తెలంగాణ ప్రజలు వినాయకుడిని ప్రార్థించారు. 2011 - 12కు గాను వేదిక కొత్త కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రవికాంత్, ఉపాధ్యక్షులుగా కరుణ, దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా సోమేశ్వర్, సంయుక్త కార్యదర్శులుగా మాధవ్, సుజాత, కోశాధికారిగా వాణి ఏలేటి, పబ్లిక్ ఆఫీసర్‌గా ఉపేందర్ ఎన్నికయ్యారు. రామ్, సురేందర్, సాగర్, ప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తారు.
English summary
Ganesh Festival 2011 in Sydney organized by Australian Telangana Forum was a great success. Historically Telangana People have been organizing Bathukamma, Telangana Liberation Day and various Telangana State related activities since 2006 under the banner TDF Australia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X