వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా విరాళాల సేకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugu Association of North America
అమెరికాలోని న్యూయార్క్‌ లాంగ్‌ ఐలాండ్‌లో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా( తానా) నిర్వహించిన విరాళ సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో 150 మందికిపైగా పాల్గొన్నారు. సుబ్బారావు అనుమోలు, రాజేశ్వరి అనుమోలు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తానా సభ్యుడు జయశేఖర్‌ తల్లూరి అతిథులకు స్వాగతం పలికారు. భారతదేశంలో తానా ఫౌండేషన్‌ ద్వారా విద్యార్థులకు ఉపకారవేతనాలు, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు తదితర అంశాల్ని ఆయన సభికులకు తెలిపారు. అమెరికాలోని తెలుగువారి కోసం తానా చేపడుతున్న సేవాకార్యక్రమాల్ని అనుమోలు తెలిపారు.

తెలుగువారికి సేవ చేసేందుకు తానా ఎల్లప్పుడు ముందు ఉంటుందని సేవాభావంతో కార్యక్రమాలు చేపడుతున్న ఇతర తెలుగుసోదర సంస్థలతో కూడా కలిసి పనిచేసేందుకు సంస్థ ఎల్లప్పుడు సంసిద్దంగా వుంటుందని తానా అధ్యక్షుడు జయరాం కోమటి అన్నారు. త్వరలో జరగనున్న 18వ తానా సమావేశాలకు జరుగుతున్న సన్నాహక ఏర్పాట్ల గురించి సతీశ్‌ చిలుకూరి వివరించారు. ఆయన సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 18వ తానా సమావేశాల్ని అందరికి గుర్తుండపోయేలా నిర్వహించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో రెండు లక్షల డాలర్లకు పైగా సంస్థకు వచ్చాయి. విరాళలిచ్చిన ప్రతి ఒక్కరికి జయరాం కోమటి కృతజ్ఞతలు తెలిపారు. విరాళ సేకరణ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన రావు అనుమోలు దంపతులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మాజీ తానా అధ్యక్షులు డా. దశరథ రామిరెడ్డి, గంగాధర్‌ నాదెళ్ల, డా. నరేన్‌ కొడాలి, సతీష్‌వేమన, సుబ్బారావు కొల్ల, జయ్‌ కురేటి, తిరుమలరావు , డా. తులసి , రాఘవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జులై 1-3 తేదీల్లో కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో తానా సభలు జరగనున్నాయి.

English summary
Telugu Association of North America (TANA| gets good response for its donation mobilisation programme. TANA is taking up service oriented pragrammes in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X