వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సమ్మెకు మద్దతుగా బోస్టన్‌లో ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తెలంగాణ సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఎన్నారై సంఘం (తెనా) అధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన బోస్టన్‌లో ప్రదర్శన నిర్వహించారు. హార్వర్డ్ స్క్వేర్ వద్ద జై తెలంగాణ నినాదాలు దద్ధరిల్లాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తారు, మేం తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నామని వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.

2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను అమలు చేయాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమర్ కర్మిల్ల, వెంకట్ మారోజు, రాజేందర్ కల్వల, రామ్మోహన్ సూరినేని, వెంకట్ రెడ్డి ముద్దసాని, స్వరుణ్ బుద్దినేని, లక్ష్మారెడ్డి గోలి, అంజయ్య శ్రీరంగ, వెంకటేశం ద్యావన, రమణ దావు, ప్రవీణ్ దేవరపు తదితరులు ఈ ప్రదర్శనలు పాల్గొన్నారు.

English summary
Telangana NRI Association (TeNA) organized a demonstration at busy Harvard Square in Boston city on this Saturday in support of "Sakala Janula Samme" in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X