వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సారంగ నుంచి “అనేక” విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

Aneka
పదేళ్ళలో తెలుగు కవిత్వం తిరిగిన మలుపులు, దాటుకొచ్చిన చౌరాస్తాలూ, చేరుకున్న అనేక మజిలీలూ…అన్నీ సాక్షాత్కరించే నిలువెత్తు అద్దం “అనేక". అఫ్సర్, వంశీ కృష్ణల సంపాదకత్వంలో…మీ ముందుకు…! అక్షరం అనుభవంగా, అనుభవం అలజడిగా, అలజడి ఆందోళనగా మారిన నడుస్తున్న చరిత్రకి కదిలించే పదచిత్రాల డైరీ “అనేక". తెలుగు ప్రచురణ రంగంలో ఒకింత వేకువ, రవంత కదలిక, కాసింత స్వచ్చమయిన సాహిత్య పరిమళం లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న “సారంగ బుక్స్" తొలి కానుక “అనేక". తెలుగులో మంచి వచనం, మంచి కవిత్వం ఎక్కడ వున్న అది పాఠకుడి మనఃఫలకం మీద బలంగా ముద్రించాలన్న ఆశా, ఆకాంక్షలే “సారంగ". ఆ దారిలో మొదటి అడుగు “అనేక".

సారంగ బుక్స్ తొలి ప్రచురణ “అనేక" పదేళ్ళ కవిత్వం జనవరి రెండో తేదీన విజయవాడ బుక్ ఫెస్టివల్ లో విడుదల అయ్యిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అఫ్సర్, వంశీకృష్ణలు సంపాదకత్వం వహించిన ఈ కవిత్వ సంకలనం మొత్తం 404 పేజీలు, దాదాపు 200 మంది కవుల కవితలు ఇందులో వున్నాయి.

వెల: 199 రూపాయలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X