వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో 4ఏళ్ల బాలుడు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

USA
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల ఇండో అమెరికన్ బాలుడు మృతి చెందాడు. ఇండో అమెరికన్ బాలాజీ జయకన్నన్ కుమారుడు ధ్యానేష్ గురువారం ప్రమాదానికి గురయ్యాడు. అమ్మ నాగరాణితో కలిసి జెఫర్సన్ అవెన్యూ, సెంట్రల్ అవెన్యూ కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది.

నాగరాణి, ధ్యానేష్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు తొలుత నాగరాణిని ఢీకొంది. ఆ తర్వాత ఆమె చేతిలో ఉన్న ధ్యానేష్ అదుపు తప్పి కింద పడ్డాడు. కిందపడిన ధ్యానేష్ మీది నుండి ఆ కారు వెళ్లింది. దీంతో అతడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్నది ఓ మహిళ అని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ధ్యానేష్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు స్థానిక భారత ఎంబసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులోని మధురైకి చెందిన బాలాజీ... ఎడిసన్ సంస్థలో ఐటి నిపుణిడిగా పని చేస్తున్నారు.

English summary
A four year old Indian American boy was mowed down by a speeding car driven by a woman at a traffic intersection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X