వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాంటీ ఒబామా ఫిల్మ్ హిట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Barack Obama
ఫ్లోరిడా: వివాదాస్పద అమెరికన్ ఇండియన్ స్కాలర్ తీసిన ఒబామా వ్యతిరేక సినిమా అమెరికాలో ఊపేస్తోంది. ఈ సినిమా ఈ వారం అగ్రస్థానంలో నిలిచిన చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది. రిపబ్లికన్ జాతీయ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో పుట్టిన దినేష్ డీసౌజా '2016: ఓబామాస్ అమెరికా' అనే పేరుతో ఈ డాక్యుమెంటరీని నిర్మించాడు. ఇది మూవీ స్వీప్ స్టేక్స్‌లో ఏడో స్థానాన్ని ఆక్రమించింది.

జులై మొదటివారంలో ఈ చిత్రం పరిమిత ప్రదర్సనలకు మాత్రమే నోచుకుంది. ఇప్పుడు 1100 థియేటర్లకు విస్తరించింది. ఇంతకు ముందు డిసౌజా రాసిన ఒబామాస్ అమెరికా: అన్‌మేకింగ్ ద అమెరికన్ డ్రీమ్, ద రూట్స్ ఆఫ్ ఒబామాస్ రేజ్ ఆధారంగా అతను ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. దాన్ని కన్జర్వేటివ్‌లు అక్కున చేర్చుకుంటున్నారు.

డిసౌజా పుస్తకాలు, డాక్యుమెంటరీ కూడా ఒబామా తృతీయ ప్రపంచానికి అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పడానికి ప్రయత్నించాయి. అందుకు కారణం ఆయన తండ్రి కెన్యాకు చెందినవాడు కావడమని చెప్పారు. ప్రపంచంలో అమెరికా ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. డిసౌజా పలు టాక్ షోల్లో కూడా పాల్గొన్నారు.

డిసౌజా చాలా కాలంగా అల్ట్రాకన్జర్వేటివ్ కమ్యూనిటీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అప్పటి బొంబాయిలో స్థిరపడిన గోవా తల్లిదండ్రులకు డిసౌజా జన్మించారు. 1978లో అమెరికాకు వెళ్లడానికి ముందు ఆయన సెయింట్ స్టానిస్లాస్ హైస్కూల్లో చదివారు. ఆయన పలు గ్రంథాలు కూడా రాశారు. రీగన్ వైట్ హౌస్‌లో 1988లో పాలసీ అడ్వయిజర్‌గా చేరారు. రీగన్ పాలసీ అడ్వయిజర్లలో పిన్న వయస్కుడు ఆయనే.

English summary
Anti - Obama movie made by a controversial Indian - American scholar has become one of the top ten films in the United States this week. Mumbai born Dinesh D'souza's "2016:Obama's America climbed upto 7 in the movie sweepstakes this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X