వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటా మహాసభలకు సన్నాహాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Arrangements made for NATA convention
అమెరికాలోని హ్యూస్టన్ (టెక్సస్) మహానగరంలో జూన్ 29 నుండి జూలై 1, 2012 వరకు మూడు రోజుల పాటూ నాటా (ఉత్తర అమెరికా తెలుగు సమితి) వారి తొలి మహా సభలు జరుగునున్నాయి. ఈ మేరకు నాటా ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు జాతి సంస్కృతి మీద ఎనలేని ఆపేక్ష తప్ప లాభాపేక్ష లేని ఈ మహాసభలకి కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందించమని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోనే అత్యున్నతమైన , సువిశాలమైన, అత్యాధునిక వేదికలలో ఒకటైన జార్జ్ ఆర్. బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రాంగణంలో ఈ మహాసభలు జరుగుతాయి.

హీరోలు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్,వేణ, శివాజీ, సాయికుమార్, ఆది, హీరోయిన్స్ విమలా రామన్, పార్వతీ మిల్ట్ న్, రీచ గన్గొపాథ్యాయ్, పూనమ్కౌర్, మధుశాలిని,స్నిగ్థ, కమీడియన్స్ ఆలీ, "తాగుబోతు" రమేశ్, ధన్రాజ్, రుపతిప్రకాష్, రజిత, దర్శకులు ఎస్వీకృష్ణారెడ్డి, నిర్మాత దిల్ రాజ్ మొదలైన తెలుగు సినిమా అతిరథ, మహారథులు హాజరువుతున్నారు. నృత్యం, హాస్యనాటికాప్రదర్శనలు - సుమారు 14 గంటల పాటు ఉంటాయని నాటా తెలిపింది.

ప్రపంచ చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా ముగ్గురు సుప్రసిధ్ధ తెలుగు సంగీత దర్శకులు మణి శర్మ, కోటీ, వందేమాతరం శ్రీనివాస్ ఒకే వేదికపై స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వర రావు కుమారులు రత్న కుమార్, హేమ చంద్ర, కారుణ్య, గీతా మాధురి, మాళవిక, మధు ప్రియ మొదలైన గాయక, గాయనీమణులతో అద్వితీయమైన వీనుల విందైన అలనాటి, ఈనాటి సినీ, లలిత సంగీత విభావరి సంగీత కార్యక్రమం ఉంటుందని చెప్పింది.

80 ఏళ్ళ తెలుగు సినిమా వైభవాన్ని చాటుతూ అమెరికాలో ఉన్న మధుర గాయనీ గాయకులందరూ ఒక వేదికపై 8 గంటల పాటు నాటి నుంచి నేటి వరకు వచ్చినా ఆణి ముత్యాల వంటి 80 పాటలతో అలరిస్తారని తెలిపింది. సుప్రసిధ్హ్ద హరికథా కళాకారిణీ శ్రీమతి జయంతి సావిత్రి (తిరుపతి తిరుమల దేవస్థానం) వారి హరికథా గానం ఉంటుంది.

తూర్పు గోదావరి జిల్లా బృందం వారిచే ఈ తరానికి తెలియని అత్యద్భ్హుతమైన బుర్ర కథ ప్రదర్శన ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి కళాకోవిదులు కెవివి సత్యనారాయణ బృందం వారి శ్రీ కృష్ణదేవరాయల "ఆముక్త మాల్యద" నృత్య రూపకం కూడా ప్రదర్శిస్తారు. సుప్రసిధ్ద సినీ కవి భువన చంద్ర ఈ నాటా మహా సభల కోసం ప్రత్యేకంగా రచించిన ప్రారంభ గీతానికి రూప కల్పన చేసి, వంద మంది చిన్నారులతో సరి కొత్త నృత్య రూపకాన్ని సృష్టించిన మన హ్యూస్టన్ వాసులూ, లబ్ధప్రతిష్టులూ అయిన డా. రత్న (పాఫ) కుమార్, ఉమా భారతి, వేదాంతం రాఘవ సమర్పిస్తున్న ఆత్మీయ స్వాగతం గీతం, మల్టీ మీడియా సమర్పణ ఉంటాయని నాటా వివరించింది.

సుప్రసిధ్ధ గాయకుడు "గురు" శ్రీ రామాచారి నిర్వహణలో "నాటా స్వరమాధురి" పేరిట బాల బాలికల పాటల పోటీలుంటాయని తెలిపింది. లఘు చిత్రాలు, గానం, నృత్యం వంటివాటిలో ఈ పోటీలు ఉంటాయి. వాణిజ్య సదస్సులు జరుగుతాయి. మహిళల ప్రత్యేకతలు, సమస్యలు, సంబంధిత అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. సుప్రసిధ్ధ తెలుగు క్రికెటర్ వివియస్ లక్ష్మణ్ చే నాటా క్రికెట్ పోటీల విజేతల గుర్తింపు జరుగుతుందని నాటా తెలిపింది.నాటా చెస్ టోర్నమెంట్ ఫైనల్ పోటీలు జరుగుతాయని తెలిపింది. కనీసం నాలుగు విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

సుమారు 250 పూర్తి రంగుల పేజీలతో సర్వాంగ సుందరంగా వెలువడుతున్న నాటా మాట సభా విశేష సంచిక వెలువరిస్తున్నారు. లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలతో రెండు రోజులు తెలుగు సాహిత్య వికాసంపై చర్చా గోష్టి ఉంటుంది. నాటా మహాసభలలో, భారతదేశం ఎల్లలు దాటి అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి సారిగా గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ వర ప్రసాద్ మరియు సహస్రావధాని డా. కోట లక్మీనరసింహం నిర్వహిస్తారు. అన్ని రంగాలవారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను రూపొందించారు.

English summary

 Arrangements were made to NATA convention to be held at Houston city of USA from June 29 to July 1. Cine artists like Balakrishna, Shivaji and others are attending the convention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X