వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాట్యాచార్యుడి మృతికి ఎన్నారైల సంతాపం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vempati Chinna Satyam
అమెరికా: కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం మృతికి ఎన్నారైలు సంతాపం ప్రకటించారు. కూచిపూడి నాట్యానికి చేసిన సేవలకుగాను అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆట్లాంటాలో జరిగిన సమ్మేళనంలో ఈ నెల 7వ తేదీన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా ప్రదానం చేసింది. చెన్నై నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా ఆ అవార్డును ప్రదానం చేసింది. భారతదేశంలో పుట్టిన కూచిపూడి నాట్యాన్ని అమెరికాలోని భావి తరాలకు కూడా ఆయన అందించడానికి ప్రయత్నించారని ఆటా ఓ ప్రకటనలో తెలిపింది.

కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తేవడంలో వెంపటి చినసత్యం సేవలు మరువలేనివని ఆటా ప్రశంసించింది. మద్రాసులో 1963లో ఆయన కూచిపూడి ఆర్ట్ అకాడమీని ప్రారంభిన విషయాన్ని గుర్తు చేసింది. ఆయన ఈ అకాడమీలో 180కి పైగా సోలో ఐటమ్స్, 15 డ్యాన్స్ డ్రామాలను రూపకల్పన చేసిన విషయాన్ని ఆటా ప్రస్తావించింది.

వెంపటి చిన సత్యం మృతికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కూడా సంతాపం వ్యక్తం చేసింది. కూచిపూడి నృత్యాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వెంపటి చిన సత్యం ప్రచారం చేశారని, జీవితాన్ని ఆయన కూచిపూడికి అంకితం చేశారని నాట్స్ చెప్పింది. 1984లో మైమీ మేయర్ ఆయనకు గోల్డెన్ కీ అందించిన విషయాన్ని గుర్తు చేసింది. 1994 సెప్జెంబర్ 24వ తేదీని ఓహ్యో డేటన్ ఆప్ మేయర్ వెంపటి చిన్న సత్యం రోజుగా ప్రకటించారని చెప్పింది.

1994 నంబర్ 3వ తేదీని ఆట్లాంటా మేయర్ కూచిపూడి నాట్య దినోత్సవంగా ప్రకటించారని గుర్తు చేసింది. 1994 సెప్టెంబర్ 24వ తేదీని మెంఫిస్ మేయర్ రామాయణం దినోత్సవంగా ప్రకటించి, కీ ఆఫ్ ద సిటీ అవార్డు ప్రదానం చేశారని చెప్పింది. కూచిపూడి నృత్యాన్ని ఎల్లలు దాటించిన ఘనత వెంపటి చిన్న సత్యందని ప్రశంసించింది.

English summary
American Telugu Association (ATA) expressed deep condolences on the demise of the Kuchipudi Legend, Sri. Vempati Chinna Satyam garu. ATA is gratified by the fact that they were able to recognize the Kuchipudi Legendary GURU during ATA convention on July 7th, 2012 at Atlanta (USA) with "ATA Lifetime Achievement Award" for his contribution to the Kuchipudi Nritya Art and for keeping alive an old art which is now passed on to the new generation of Americans of Indian origin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X