వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో భగవద్గీతపై క్విజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhagavad Gita quiz contest in Pakistan
పాకిస్తాన్‌లో హిందూ గ్రంథం శ్రీమద్భగవద్గీతపై క్విజ్ ఏర్పాటు చేశారు. పాక్‌లోని కరాచీ నగరంలోని గిజ్రిలేన్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో మన భగవద్గీత మారుమోగింది. హిందూ మతానికి చెందిన విద్యార్థుల మధ్య భగవద్గీతఫై క్విజ్ పోటీ నిర్వహించారు. అంతేకాదు.. ఈ పోటీ నిర్వహణకు ముస్లిం ఉపాధ్యాయులు, ఇతరులు కూడా సాయం చేశారు.

పాకిస్థాన్ హిందూ సేవ (పిహెచ్ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఇక్కడి సాంక్టా మరియా పాఠశాలలో శనివారం ఈ పోటీని నిర్వహించింది. అనంతరం పిహెచ్ఎస్ అధ్యక్షుడు సంజేష్ మాట్లాడారు. పిల్లలకు మొదట భగవద్గీతను బోధించామని, ఆ తర్వాత దాని గురించి పలు ప్రశ్నలడిగామని, దీని వల్ల వారికి మన హిందూ సంస్కృతి, పవిత్ర గ్రంథాల గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఏర్పాట్లలోనూ వారు పాలు పంచుకున్నారని తెలిపారు. ఈ విజయంతో.. మరిన్ని పోటీలు నిర్వహించాలనే ఆలోచన తమకు వచ్చిందన్నారు. పాకిస్థాన్‌లో హిందువులున్న ప్రతీ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని పిహెచ్ఎస్ ప్రతినిధి సంజయ్ చెప్పారు. ఈ క్విజ్ కార్యాక్రమంలో పాఠశాలకు చెందిన పలువురు బాలురు, బాలికలు పాల్గొన్నారు.

English summary
It may sound strange but shlokas from Bhagavad Gita reverberated in a school in Karachi, Pakistan, where young Hindu boys and girls took part in a quiz contest held on Saturday to test their knowledge of their religion -- Sanatan Dharma. Buoyed by the success of the event, the organizers, Pakistan Hindu Seva (PHS), a welfare trust, has decided to hold such contests more often.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X