ఎన్నారైల బతుకమ్మ సంబరాలు
ఆమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో (టిఎజిసి) సంయుక్త ఆధ్వర్యంలో ప్రవాసంద్రులు దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇల్లినొయిస్ రాష్ట్రం నలుమూలల నుండి అమెరికా వలసవచ్చిన 500 పైగా తెలుగువారు అంతా కలిసి చికాగోలోని ఆరోర వెంకటేశ్వరా స్వామి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ, దసరా పండుగలను శనివారం రోజు ఈ నెల 6వ తేదీన చేసుకున్నారు. ఈ వేడుకలు శనివారం ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అత్యంత ఉత్సాహంతో ఘనం గా జరిగాయి.

మధ్యాన భోజనం ఆరగించిన తరువాత, మహిళలు సంప్రదాయబద్దంగా రంగు రంగుల పట్టువస్త్రాలు దరించి, అందంగా అలంకరించిన రంగురంగుల బతుకమ్మలతో చికాగోవాసుల కన్నుల విందు చేశారు. పిల్లలు, పెద్దలు చేరి బతుకమ్మ పాటలతో సాయంత్రం వరకు ఆడి, గౌరమ్మ తల్లికి పూజ చేసి తరువాత వార వారి బతుమ్మలను మేలా తాళాలు, బాజాభజంత్రిలతో గుడి కొలనులో ఒదిలారు.
ఈ పండుగల సందర్బంగా పిల్లలకు పరి విధాల ఆటల పోటీలు నిర్వహించారు, గెలిచినా పిల్లల అందరికి ఆట వ్యవస్త్హపకులు హన్మంత్ రెడ్డి, న్యూయార్క్ లైఫ్ కృష్ణ రంగరాజు బహుమతులను అందజేశారు.
సాయంత్రం గుడి పూజారి సుభద్రా చార్యులు అక్కడికి వచ్చిన వారందరితో దస్తూరి వ్రాయించి, జమ్మి వృక్షానికి, ఆయుధ పూజ చేశారు. వచ్చిన వారందరకి పూజ చేసిన కంకణాల కట్టి ఆశీర్వదించి, ప్రసాదం పంచారు. పిల్లలు జమ్మి ఆకులను పంచి పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకొన్నారు. అంతా జమ్మి ఆకులను పరస్పరం పంచుకుని ఆశీర్వాదం తీసు కొన్నారు. ఈ వేడుకలు భారతదేశంలోని దసరా ఉత్సవాలని మరిపించాయని పలువురు ప్రశంసించారు.
తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో అధ్యక్షుడు కల్యాణ్ అనందుల, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం, ఆటా కోశాధికారి సత్య కందిమళ్ళ, బతుకమ్మ కార్య నిర్వాహకుడు శ్రీనివాస్ సరికొండ ఈ వేడుకకు విచ్చేసిన ఆతిథులకు, దాతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుక విజయవంతం కావడానికి జ్యోతి చింతలపని, పద్మ మాదిరెడ్డి, రామ్ అదే, శ్రీనివాస్ పెదమల్లు, అంజి కందిమళ్ళ, ప్రదీప్ కందిమళ్ళ, మూర్తి పీసపాటి, జగన్ బుక్కరాజు, రమేష్ గారపాటి, శ్రీనివాస్ చాడ, శ్రీనివాస్ మత్త, భాను స్వర్గం, అమర్ నెట్టెం, నరేందర్ చేమర్ల మరియు సత్య కొండపల్లి అహర్నిశలు కృషి చేశారు.












Click it and Unblock the Notifications