వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు దంపతులకు చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Court rejects bail to Telugu couple in Norway
ఓస్లో: కన్నకొడుకును మందలించిన కేసులో జైలు పాలైన నార్వే తెలుగు దంపతులకు ఓస్లో కోర్టులో చుక్కెదురైంది. విచారణ సమయంలో తమను బెయిల్‌పై విడుదల చేయాలనే వారి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. మరో నాలుగువారాల పాటు జైల్లోనే ఉన్న తర్వాతే కింది కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి ఆదేశాలిస్తామని కోర్టు తేల్చి చెప్పింది.

తెలుగు దంపతులు చంద్రశేఖర్ వల్లభనేని, అనుపమ తరఫున వాదిస్తున్న న్యాయవాది మార్టె బార్ట్రోమ్ ఆ విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడు అవసరమైనా దంపతులు కోర్టులో హాజరవుతారని చంద్రశేఖర్ పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ కోర్టు అందుకు అంగీకరించలేదు.

కేసు విచారణలో భాగంగా - చంద్రశేఖర్, అనుపమల కుమారుడు ఏడేళ్ల శ్రీరామ్ ఆరోగ్యం క్షీణిస్తోందని బార్ట్రోమ్ న్యాయమూర్తికి విన్నవిస్తుండగా, ఆ మాటలు విన్న అనుపమ కోర్టులోనే బిగ్గరగా ఏడుస్తూ కుప్పకూలిపోయారు.

కానీ, వారిద్దరూ శ్రీరామ్‌ను తీవ్రంగా హింసించారని, వారిని విడిచిపెడితే దేశం విడిచి పారిపోతారని ప్రాసిక్యూషన్ వాదించింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా, జైలులో అనుపమ ఏమీ తినట్లేదని, తాగట్లేదని, పిల్లల కోసం అదే పనిగా ఏడుస్తున్నారని బార్ట్రోమ్ తెలిపారు. కొడుకుని హింసించిన కేసులో చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆ దంపతులకు సహాయం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నార్వే చట్టాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగానే మారింది.

English summary
Norway court has rejected Telugu couple Chandrasekhar Vallabhaneni and Anupama plea. They appealed the court to grant bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X