భార్యను వదిలేసిన ఎన్నారై

హిగుమ్ హుస్సేన్ (58) తనను శుక్రవారం వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది. హుస్సేన్ మార్షియస్ జాతీయుడు. అయితే, అతను నవసరికి చెందినవాడు. జహేదాను పెళ్లి చేసుకోవడానికి గురువారం అతను నవసిరికి వచ్చాడు. సంప్రదాయం ప్రకారం ఇరువురికి వివాహం జరిగింది.
పెళ్లయిన రెండో రోజు తనను, తన సోదరుడు ఆరిఫ్‌ను పిలిచి 25 లక్షల రూపాయలు అడిగాడని జహేదా తన ఫిర్యాదులో హుస్సేన్‌పై ఆరోపణ చేసింది. ఆ సొమ్ము ఇవ్వకపోతే తనను మార్షియస్‌కు తీసుకుని వెళ్లేది లేదని చెప్పాడని ఆమె అన్నది. తాను అంత మొత్తం ఇచ్చుకునే స్థితిలో లేనని ఆరిఫ్ హుస్సేన్‌కు చెప్పాడు. దాంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఆరిఫ్‌ను హుస్సేన్ కొట్టాడని, దాంతో ఆరిఫ్‌కు గాయాలు అయ్యాయని జహేదా తెలిపింది. హుస్సేన్ ఆ తర్వాత పారిపోయాడని, ఆ తర్వాత అతని జాడ కనిపించలేదని జహేదా తన ఫిర్యాదులో వివరించింది. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. మొదటి భార్యకు హుస్సేన్ విడాకులు ఇచ్చాడని, అతనికి పిల్లలు కూడా ఉన్నారని, వారు మార్షియస్‌లో ఉన్నారని జహేదా చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications