వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్సర్‌కు ఆదర్శ అధ్యాపక అవార్డు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
అమెరికాలో విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు భాషా సాహిత్యాలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రముఖ కవి, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆసియా విభాగం సీనియర్ అధ్యాపకుడు, ఖమ్మంవాసి డాక్టర్ అఫ్సర్‌కు అత్యుత్తమ ఆదర్శ అధ్యాపకుడిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) హ్యూస్టన్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సభల్లో అవార్డు ప్రదానం చేసింది. తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, తానా ఫౌండేషన్ డైరెక్టర్ జంపాల చౌదరి, ప్రముఖ తెలుగు అచార్యులు వేల్చేరు నారాయణ రావు ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అంశాల గురించి విశేషమైన సేవలు చేయడమే కాకుడా ఆదర్శ అధ్యాపకుడిగా అఫ్సర్ ఈ తరంపై గొప్ప ప్రభావం వేశారని, సాహిత్య అధ్యాపకుడిగా కొన్ని వందల మంది విద్యార్థులను తీర్చి దిద్దారని తానా అవార్డు సత్కార ప్రకటనలో ప్రశంసించారు.

డాక్టర్ అఫ్సర్ ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు కవి, పత్రికా రచయిత కౌముది కుమారుడు. ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో ఆయన చదువుకున్నారు. ఖమ్మం సిద్ధారెడ్డి కళాశాలలో ఇంగ్లీష్ సాహిత్యంలో బిఎ చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేశారు. వివిధ అంతర్జాతీయ పత్రికల్లో అఫ్సర్ రచనలు ఆంగ్లంలో అచ్చయ్యాయి. ఆయన కృషికి గుర్తింపుగా అమెరికన్ ఇనిస్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రదానం చేసింది. అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆయన ప్రసంగాలు చేశారు. కవిత్వం చదివారు. చర్చాగోష్ఠులు నిర్వహించారు.

English summary
Eminent Telugu poet Dr Afsar was honoured by TANA with best teacher award.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X