వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు తేజానికి ప్రతిభా పురస్కారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Excellence Award to Telugu Engineer
ఒమన్ లో గ్రాండ్ హయత్ హోటల్ లో వైభవం గా జరిగిన ఐటిపి గ్రూప్ (యుకె) వారు నిర్వహించిన కన్‌స్ట్రక్షన్ వీక్ - ఒమన్ 2012 అవార్డ్స్ లో భీమవరం వాస్తవ్యుడు, ప్రస్తుతం ఒమన్ లో రెసిడెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఎంఎన్ఆర్ గుప్తాను సేవలకు గుర్తింపుగా ఇంజనీర్ అఫ్ ది ఇయర్‌గా న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. ఒమన్ మొత్తం నుంచి స్వీకరించిన నామినేషన్లు వచ్చాయి. గుప్తా ఒక్కరే ఇంజనీర్ అఫ్ ది ఇయర్, కన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్‌ అఫ్ ది ఇయర్ విబాగాలలో ఫైనల్స్ కు చేరుకొని చరిత్ర సృష్టించారు.

చాలా దేశాలకు సంబందిచిన ఇంజనీరింగ్ నిపుణలతో పోటీ పడి ఈ ఘనతను సాదించిన ఏకైక వ్యక్తిగా నిలిచినందుకు ఒమన్ తెలుగు కళా సమితి వారు ఒమన్ ‌లో ఏప్రిల్ 6 వ తేదిన జరిగిన ఉగాది సుస్వరాలు కార్యక్రమంలో గుప్తాను సత్కరించారు. ఈ కార్యక్రమానికి కస్తూరి రంగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దుబాయ్ లో ఏప్రిల్ 27 వ తేదీన రిట్జ్ కార్ల్‌టోన్, డిఐఎఫ్‌సి హోటల్ లో జరిగిన నిట్ మూమెంట్స్ - 2012 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రణాళికా సంఘం సభ్యుడు పద్మ భూషణ్ డాక్టర్ కస్తూరి రంగన్ నిట్ వరంగల్‌లో ఎంటెక్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇంజనీరింగ్ చదివిన గుప్తాను మధ్య ప్రాచ్యంలో ఉత్తమ ఇంజనీర్‌గా గుర్తించి అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ ఇంజనీర్ గా ఎన్నో క్లిష్టతరమైన ప్రాజెక్ట్స్ను విజయవంతంగా పూర్తీ చేయడంలో విశేష ప్రతిభ పాటవాలను, నైపుణ్యాన్ని గుప్తా ప్రదర్శించారు.

గుప్తా ఇప్పటివరకు 6 అవార్డులు, 13 సత్కారాలను ఇండియా, ఒమన్ మరియు దుబాయ్ దేశాలలో కేవలం మూడున్నర ఏళ్ల వ్యవధిలోనే అందుకోవటం విశేషం. ఈ ఘనతను సాదించినందుకు, భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఇలాంటి విజయాలతో విదేశాలలో పెంచుతున్నందుకు దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు గుప్తాను అభినందించారు.

English summary
MNR Gupta for recognition of outstanding achievements received award from Padma Bhushan Dr Kasturi rangan who is member of Planning commission and served as chairman of ISRO during NIT moments 2012 in Dubai on 27/04/2012 in Ritz-carlton hotel - from entire civil engineers working in middle east region who are alumni of all NITs in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X