వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబార్షన్‌కు నో: భారత మహిళ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Indian woman dies after being refused abortion in Ireland
లండన్: అబార్షన్‌కు వైద్యులు నిరాకరించడంతో ఐర్లాండులో ఓ భారతీయ మహిళ మృత్యువాత పడింది. రక్తం విషం ఎక్కి ఆమె మరణించింది. కాథలిక్ దేశం కాబట్టి తాము అబార్షన్ చేయబోమని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె మరణించింది. మృత్యువాత పడిన 31 ఏళ్ల భారత మహిళ డెంటిస్టు. ఆ మహిళ సవితా హలపనవార్ మృతిపై ఐరిష్ అధికారవర్గాలు విచారణకు ఆదేశించాయి.

ఆమె 17 వారాల గర్భవతి. ఆమె మిస్ క్యారేజీతో బాధపడుతోంది. సెప్టికేమియాతో కూడా బాధపడుతోంది. గాల్వేలోని బోస్టన్ సైంటిఫిక్ ఇంజనీర్ అయిన ఆమె భర్త ప్రవీణ్ హలపనవార్ - అబార్షన్ చేయాలని మూడు రోజులుగా ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాని చెప్పారు.

ఓ రోజు సవిత భరించలేనంత నొప్పితో బాధపడిందని, దాంతో అబార్షన్ కోసం అడిగామని చెప్పారు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటోందని, ఇది కాథలిక్ దేశం కాబట్టి మనిషి చంపే అబార్షన్ చేయబోమని వైద్యులు చెప్పారని ఆయన వివరించారు.

మృతశిశువును తర్వాత బయటకు తీశారు. సవితను హై డిపెండన్సీ యూనిట్‌కు, ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అయితే, ఆమె అక్టోబర్ 28వ తేదీన యూనివర్శిటీ ఆస్పత్రి గాల్వేలో సెప్టికేమియాతో మరణించింది. ఐర్లాండ్‌లో అబార్షన్ చట్ట విరుద్దం. అయితే, సవిత మృతిపై దర్యాప్తు సాగుతోంది. తాను ఐరిష్‌ను గానీ కాథలిక్‌ను గానీ కానని కర్ణాటకకు చెందిన సవిత మరణించే ముందు అన్నారు.

English summary

 A 31-year-old Indian woman died in Ireland from blood poisoning after doctors allegedly refused to perform an abortion stating ‘this is a Catholic country’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X