వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్లాంటాలో మంత్రి కన్నా లక్ష్మినారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanna Lakshminarayana visits Atlanta
అట్లాంటా: అమెరికాలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల సందర్శన కోసం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శుక్రవారం 7వ తేదీన అట్లాంటా చేరుకున్నారు. నవంబర్ 29వ తేదీ నుంచి ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పరిస్థితులను, సౌకర్యాలను పరిశీలించడానికి ఆయన వచ్చారు.

అలంబాలోని టస్క్‌గీ విశ్వవిద్యాలయాన్ని, జార్జియా, అలంబాలోని వ్యవసాయ క్షేత్రాలను ఆయన సందరిశించారు. కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు కూడా ఉన్నారు.

అట్లాంటాలో తెలుగు కమ్యూనిటీ కన్నా లక్ష్మినారాయణ గౌరవార్థం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి కన్నా లక్ష్మినారాయణను తెలుగు ఎన్నారైలు సత్కరించారు. రాంప్రకాష్ గూడూరి, రాజేష్ యల్లబండి, వెంకట్ మీసాల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కన్నా లక్ష్మినారాయణ వివరించారు. కొన్ని అడ్డంకులు ఎదురవుతున్పప్పటికీ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పయనిస్తోందని ఆయన చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జాలయ్య మాట్లాడారు.

English summary
Honorable minister of Agriculture Kanna lakshminarayana who is on tour of USA to visit agricultural universities here was in Atlanta on Friday, Deceber 07. Honorable minster is on a US tour since November 29 visiting agriculture universities, to exchange the facultires and UOMs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X