వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి డైలీకి ఎన్నారైల అండ

By Pratap
|
Google Oneindia TeluguNews

 NRIs support Sakshi daily
సాక్షి మీడియా ఫై సిబిఐ, కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు ఒడిగట్టాయిని వైయస్సార్ కాంగ్రెసు డెట్రాిట్ విభాగం ఎన్నారైలు విమర్శించారు. సాక్షి ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేసిన నేపథ్యంలో శుక్రవారం నాడు డిట్రాయిట్ లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నారై నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అక్కసుతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి సిబిఐని పావులా వాడుకుంటోందని వారు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపుగా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న "సాక్షి" గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారని వారు మండిపడ్డారు.

ఈ సిబిఐ కుట్ర వెనుక వున్నసోనియా గాంధీ, రామోజీ, చంద్రబాబు, అంబానీ తదితరులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా ఏకమై చందాలు వేసుకోనైనా సరే సాక్షి మీడియాని నడిపించుకుంటామని, వైయస్ జగన్ నాయకత్వాన్ని కాపాడుకుంటామని వారు ధీమా వ్యక్తం చేసారు. ఇప్పుడు మన దేశాన్ని పాలిస్తోంది కాంగ్రెస్ పార్టీ నా లేక ఇటాలియన్ మాఫియా నా అని ప్రజలు అయోమయంలో పడ్డారని విచారం వ్యక్తం చేసారు. అన్యాయాన్ని ఆపి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని ఇప్పటికే తాము వినతి పత్రాలను ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపించామని వారు చెప్పారు.

లింగాల హరిప్రసాద్ రెడ్డి, డాక్టర్ రామచంద్ర రెడ్డి, ఆత్మకూరు వినోద్, వెంకట్ బీరం, సునీల్ మండుటి, పిడపర్తి శ్రీనివాస్ రెడ్డి, టి. శ్రీధర్ రెడ్డి, భూమిరెడ్డి యుగంధర్, యార్లగడ్డ శివరాం, కుకునూర్ వినోద్, చిత్తలూరి శ్రీనివాస్, పురషోత్తం కూకటి, రవి కిరణ్, సాంబి రెడ్డి, కొండా జగన్మోహన్ రెడ్డి, బివి రెడ్డి, రమణ రెడ్డి పటేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
YSR Congress party Detroit wing NRIs condemned the freezing of YS Jagan's media bank accounts by and issuing GO stopping advertisements to Sakshi media. They submited memoranda to PM Manmohan Singh and president Pratibha patil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X