వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డో కెమికల్స్‌తో డీల్‌పై ఎన్నారైల నిరసన

By Pratap
|
Google Oneindia TeluguNews

 PFL held a protest against the Olympics sponsorship deal with Dow Chemicals
డో కెమికల్స్‌తో ఒలింపిక్ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకు పీపుల్ ఫర్ లోకసత్తా (పిఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఎన్నారైలు ప్రదర్శన నిర్వహించారు. డో కెమికల్స్ యాజమాన్యంలోని యూనియన్ కార్బయిడ్ భోపాల్ గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో వారు ఈ నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రమాదంలో 25 వేల మంది దాకా మరణించగా, యాబై వేల మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు సరైన వైద్యం కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు. భోపాల్‌లో అనైతిక, అమానుష చర్యకు నిరసనగా డో కెమికల్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఎన్నారైలు ఒలింపిక్ కమిటీని డిమాండ్ చేశారు. బాధితులకు సరైన వైద్యం అందించడానికి, నష్టపరిహారం చెల్లించడానికి, గ్యాస్ లీకేజీ శిథిలాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని వారు డో కెమికల్స్‌ను, భారత ప్రభుత్వాన్ని కోరారు. 28 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్పాలని కూడా వారు డో కెమికల్స్‌ను డిమాండ్ చేశారు.

భోపాల్‌ను మేం మర్చిపోలేం, ఇండియా హీరోషిమా - భోపాల్, డో మస్ట్ పే వంటి నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. డో కెమికల్స్ స్పాన్సర్‌షిప్‌ను నిరసిస్తూ లండన్ ఒలింపిక్స్ ఎథిక్స్ కమిషనర్ పదవికి మెరెడిత్ అలెగ్జాండర్ రాజీనామా చేయడాన్ని వారు ప్రశంసించారు. భోపాల్ ప్రమాదానికి సంబంధించి బాధితులకు సరైన నష్టపరిహారం చెల్లించకపోవడాన్ని, స్థలాన్ని శుభ్రం చేయకపోవడాన్ని మెరిడిత్ నిరసించారు. మెరిడిత్‌ను నిరసనకారులు హీరోగా అభివర్ణించారు.

English summary
People For Loksatta members of Los Angeles held a protest against the Olympics sponsorship deal with Dow Chemicals. In 1984, a Union Carbide (now owned by Dow Chemicals) pesticide plant in Bhopal, India, had a gas leak accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X