వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో పిఎఫ్ఎల్ మార్చ్

By Pratap
|
Google Oneindia TeluguNews

PFL marches in the INDIA Day Parade in New York
న్యూయార్క్: లోక్‌సత్తా సురాజ్య స్థాపన స్ఫూర్తిని స్మరిస్తూ పీపుల్ ఫర్ లోక్‌సత్తా న్యూజెర్సీ చాప్టర్ న్యూయార్క్‌లో 32వ ఇండియా డే పరేడ్‌ను నిర్వహించింది. సురాజ్యం కోసం భారతదేశంలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తూ ఈ మార్చ్ జరిగింది.

పీపుల్ ఫర్ లోక్‌సత్తా, ఇండియా అగెనెస్ట్ కరప్షన్‌లకు చెందిన దాదాపు 40 మంది వాలంటీర్లు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలను, సుపరిపాలనను కోరుతూ వారు ఈ ప్రదర్శన నిర్వహిచారు. పిఎఫ్ఎల్ టీ షర్టులు ధరించి, సురాజ్య ఉద్యమ ప్లకార్డులను చేతబూని మార్చ్ చేశారు. వందేమాతరం, జై హింద్, పీపుల్ ఫర్ లోక్‌సత్తా, జై కిసాన్ జై జవాన్ నినాదాలు చేశారు. ఈ మార్చ్ మాడిసన్ ఎవెన్యూ 38వ స్ట్రీట్ నుంచి 23వ స్ట్రీట్ వరకు జరిగింది.

వారి నినాదాలు చూపురులను ఆకర్షించాయి. వారు కూడా మార్చ్‌లోకి వచ్చి చేరారు. పిఎఫ్ఎల్ మార్చింగ్ గ్రూపునకు ఇండియా అగెనెస్ట్ కరప్షన్ వాలంటీర్లు మద్దతు తెలిపారు. ఇరు పక్షాలు మార్చ్‌లో పాల్గొన్నాయి. నినాదాలు చేశాయి. ఆ తర్వాత పరేడ్‌ జరిగింది. జాతీయ గీతాలాపన చేశారు. పరేడ్‌లో పిఎఫ్ఎల్ పాల్గొనడం ఇది వరుసగా మూడో సంవత్సరం

ఎన్నారైలకు వోటింగ్ హక్కును కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా పిఎఫ్ఎల్ పనిచేస్తూ వస్తోంది. సురాజ్య స్థాపన కోసం పనిచేస్తామని పిఎఫ్ఎల్ కార్యకర్తలు అన్నారు. శ్రీనివాస్ రనబోతు, శ్రీనివాస్ కరతూరి, సురేష్ ఏడిగ, న్యూజెర్సీ టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

English summary
People for Lok Satta, New Jersey Chapter, marched in the 32nd INDIA Day Parade in New York, to resonate the spirit of Lok Satta’s “Surajyam (Good Governance)”movement in INDIA. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X