వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో వనభోజనాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఇటీవల అమెరికాలోని డెట్రాయిట్‌లో నిర్వహించిన వనభోజనాలు కార్యక్రమం విజయవంతమైంది. మిచిగాన్ ట్రాయ్ బౌలాన్ పార్కులో ఈ వనభోజనాల కార్యక్రమాన్ని జరుపుకున్నారు. దాదాపు 300 మంది వంటలు చేసుకుని, భోజనాలు చేసి, వినోద కార్యక్రమాల ద్వారా ఉల్లాసంగా గడిపారు.

డెట్రాయిట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పార్కులో బగారా రైస్, షోర్వా, టొమాటా దాల్ (పప్పు), పచ్చి పులుసు వంటి వంటకాలు చేశారు. ఆ వంటకాలతో పరిసర ప్రాంతాలు గుమగుమాలాడాయి. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అంత్యాక్షరి వంటి క్రీడా వినోద కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. కృష్ణ కుమార్ తెలంగాణ జానపద గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

టిడిఎఫ్ నేతలు మధు కె రెడ్డి (టిడిఎఫ్ వ్యవస్థాపకుడు), మురళీ చింతలపాణి (టిడిఎఫ్ ప్రస్తుత అధ్యక్షుడు), లక్ష్మణ్ అనుగు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల మధ్య సమైక్యత అవసరాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరాన్ని వారు వివరించారు.

కోఆర్డినేటర్స్, వాలంటీర్లు అశోక్ పెరుమాండ్ల, ప్రవీణ్ కేశిరెడ్డి, దామోదర్ గంకిడి, భరత్ నేరవెట్ల, ప్రవీణ్ జొన్నలగడ్డ, మహేష్ వి, మల్లిక్ పడొకొనే, వినోద్ ఆత్మకూరు, సునీల్ యార్ల రాజన్, కరుణాకర్ పోరెడ్డి, సంతోష్ కాకులవరం, తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు.

English summary
Loudy weather with nice breeze set the perfect stage to support the enthusiasm of a strong Telangana community in the Metro Detroit region as over 300 families converged at the Boulan Park,Troy,Michigan to cook, eat and play at the Telangana Development Forum- organized Telangana Vanabhojanalu here on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X