హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నార్వే జైలుకు టెక్కీ జర్నీ ఇలా..

By Pratap
|
Google Oneindia TeluguNews

 A techie’s journey to prison in an alien land
హైదరాబాద్: కుమారుడిని హింసించాడనే ఆరోపణపై నార్వే జైలు ఊచలు లెక్కిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వల్లభనేని చంద్రశేఖర్ కృష్ణా జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 34 ఏళ్ల చంద్రశేఖర్ వరంగల్‌లోని వరంగల్ రిజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఇసి)లో చదివాడు. ఇప్పుడు దాన్ని వరంగల్ నిట్‌గా పిలుస్తున్నారు. చంద్రశేఖర్ స్వస్థలం కృష్ణా జిల్లాలోని దొండపాడు.

ఉన్నత చదువుల కోసం చంద్రశేఖర్ హైదరాబాదుకు వచ్చారు. ఆయన తండ్రి వి. సత్యనారాయణ స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చంద్రశేఖర్ నిక్, విప్రో సంస్థల్లో పనిచేశారు. ఐదేళ్ల క్రితం టిసిఎస్‌లో చేరారు. ఆయన భార్య అనుపమ కూడా ఇంజనీరే. వారికి శ్రీరామ్, అభిరామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్ కుటుంబానికి హైదరాబాదులోని మియాపూర్‌లో అపార్టుమెంటు ఉంది. శ్రీరామ్ హైపర్ సెన్సిటివ్ కావడంతో అనుపమ ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు.

అనుపమ తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటారు. టిసిఎస్‌లో సీనియర్ మేనేజర్ అయిన చంద్రశేఖర్ ఆఫీసు పని మీద ఏడాదిన్నర క్రితం నార్వేలోని ఓస్లో వెళ్లారు. కుమారుడిని హింసించారనే ఆరోపణపై ఓస్లో కోర్టు చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధించింది.

కూతురు, అల్లుడికి జైలు శిక్ష విధించినట్లు తెలియడంతో హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో నివసిస్తున్న అనుపమ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ కూతురు, అల్లుడి అరెస్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా స్పందించలేదని అనుపమ తండ్రి ఎల్.వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను జైలులో పెట్టి పిల్లలకు చేసిన న్యాయమేమిటని ప్రశ్నించారు.

కాగా, చంద్రశేఖర్, అనుపమల కేసు విషయంలో కేంద్రం ఆచితూచి స్పందించింది. తీర్పును పరిశీలించిన తర్వాతే తగిన న్యాయ సహాయం చేస్తామని విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. నార్వేలోని భారత రాయబారితో, అక్కడి ప్రభుత్వంతో తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఇక ఆ దేశ చట్టాల ప్రకారమే భారతీయ దంపతులను నార్వే జైల్లో పెట్టిందని, ఇదేమీ నేరం కాదని ప్రవాస భారతీయ శాఖ మంత్రి వయలార్ రవి అన్నారు.

English summary
Convicted 34-year-old V Chandrasekhar comes from a family of farmers in Krishna district and is an alumnus of REC, Warangal (now NIT, Warangal)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X