చరిత్ర సృష్టించిన బేరా, తులసి

అంతకు ముందు ఇండియన్ అమెరికన్స్ దలీప్ సింగ్ సౌంధ్ 1950లో, 2005లో బాబీ జిందాల్ హౌస్ ఆఫ్ రెప్రజెంటిటివ్లుగా ఎన్నికయ్యారు. తులసి గబ్బర్డ్ కాంగ్రెసుకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన మొదటి హిందువు. 113వ కాంగ్రెసులో 43 మంది ఆఫ్రికన్ అమెరికన్ సభ్యులుననారు. రికార్డు స్థాయిలో వంద మంది మహిళలున్నారు.
బేరా, తులసి కూడా డెమొక్రటిక్ పార్టీకి చెందినవారే. బేరా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన భార్య, కూతురు, సోదరులు, తండ్రి పాల్గొన్నారు. తలసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖ హిందూ అమెరికన్లు హాజరయ్యారు. ఆమె భగవద్గీతపై ప్రమాణం చేశారు.
జీవితంలో ఎదురైన అనేక సవాళ్ల నుంచి తనకు అంతరంగ ప్రశాంతతను, శక్తిని భగవద్దీత ప్రసాదించిందని గబ్బర్డ్ అన్నారు. ఆమె పుట్టుక రీత్యా హిందువు కాదు. ఆమె తండ్రి మైక్ గబ్బర్డ్ ప్రస్తుతం హవాయ్ స్టేట్ సెనేటర్‌గా ఉన్నారు. తల్లి కరోల్ పోర్టర్ గబ్బర్డ్ ఎడ్యుకేటర్, బిజినెస్ ఓనర్.
తన తల్లి హిందువు అని, తండ్రి కాథలిక్ అని తులసి గబ్బర్డ్ చెప్పారు. టీనేజర్‌గా ఉన్నప్పుడే తలసి హిందూ మతాన్ని స్వీకరించారు. భగవద్దీత బోధనల ద్వారా తాను ఆధ్యాత్మిక ప్రయాణం చేశానని ఆమె అన్నారు.