వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో లాటా అవిర్భావం

By Pratap
|
Google Oneindia TeluguNews

LATA
లాస్ ఏంజల్స్: లాస్ ఏంజల్స్ తెలుగు వారు తమకంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం రోజు న అంగరంగ వైభవంగా, లాస్ ఏంజల్స్ లో జరిగినటువంటి లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) ఆవిర్భావ సభ జరిగింది. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 150 మంది వాలంటీర్లతో ఒక స్థానిక తెలుగు సంస్థ ఏర్పడింది. నిర్వాహకులు కూడా నివ్వెరపోయే విధంగా జరిగనటువంటి ఈ సభలో అనేక మంది లాస్ ఏంజల్స్ ప్రముఖులు పాల్గొన్నారు. స్థానికంగా తెలుగు వారి సంఖ్య పెరగడం, అలాగే వారి అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ, సేవా భావం కలిగినటువంటి ఒక సంస్థ యొక్క అవసరాన్ని గుర్తిస్తూ అనేకమంది స్థానిక పెద్దల ప్రోత్సాహంతో ఈ "లాటా" అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు రమేష్ కోటమూర్తి మాట్లాడుతూ - మునుపెన్నడూ లేని విధంగా ఇంతమంది సేవా దృక్పథం కల్గినటువంటి సభ్యులందరూ ఒక్క చోట చేరి సాటి తెలుగు వారికి ఇతోదకంగా సాయపడాలనే తాపత్రయం ఎంతో అద్భుతమని అన్నారు. ఇదే స్పూర్తితో ఒక పటిష్టమైన సంస్థను ఏర్పాటు చేసుకోవడం మన కర్తవ్యం అన్నారు. ఈ సంస్థ తెలుగువారి సేవే పరమావధిగా పూర్తి పారదర్శకతతో మీ అందరి సారధ్యంలో నడుస్తుందని హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

ఈ సంస్థలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి అవసరాలను గుర్తిస్తూ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చెయ్యాలని లాస్ ఏంజల్స్ లోని ప్రముఖ తెలుగు పాఠశాల, తెలుగుతోట, నిర్వాహకురాలు విద్య తాడంకి కోరారు. అదే సమయంలో పిల్లలకు సంభంధించి తెలుగు భోధనా కార్యక్రమాలను రూపొందించడానికి కావలిసినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరో ప్రముఖ స్థానిక మహిళ లక్ష్మి చిమట గారు కూడా ఇదే విషయాన్ని నిర్వాహకుల దృష్టి కి తీసుకువచ్చారు.

మంచి రోజులు ముందున్నాయని పేర్కొంటూ ఇదే స్పూర్తితో మన తెలుగు వారికి ఒక శాశ్వత భవనాన్ని నిర్మించుకోవాల్సిని అవసరాన్ని ఎల్ఎ తెలుగు డాట్ కామ్ నిర్వాహకుడు నందన్ పొట్లూరి అన్నారు. అలాగే మరో నిర్వాహకుడు సుబ్బా గోపవరపు మాట్లాడుతూ - ఉపాధి అవకాశాలకు సంభందించి కొన్ని కార్యక్రమాలను తానే ముందుండి రూపొందిస్తానని, వీటి వల్ల అనేక మంది తెలుగు వారు లబ్ది పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరొక ప్రముఖ లాస్ ఏంజల్స్ నివాసి, యుసిఎల్ఎ ప్రొఫెసర్ డా. శ్రీనివాస రెడ్డి లాటాకు తన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

లాటా నిర్వహించబోయే సాంస్కృతిక కార్యక్రమాల గురించి, అలాగే వాటికి సంభందించిన ఏర్పాట్లు గురించి సాంస్కృతిక కార్యదర్శి రవి తిరువాయిపాటి వివరించారు. అలాగే ఏప్రిల్ 20, 2013 న జరిగే ఉగాది ఉత్సవాలలో కేవలం స్థానికుల ప్రతిభను ప్రోత్సహించాలని నిర్ణయించామని, దీనిని మీ అందరూ కలిసి జయప్రదం చెయ్యాలని ఆయన కోరారు. క్రీడలకు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి లాటా చేపట్టబోయే కార్యక్రమాలను సురేష్ అయినంపూడి గారు వివరించారు. సంస్థకు మొట్ట మొదటి విరాళంగా ప్రముఖులు శ్రీధర్ అద్దంకి $1,116.00 ప్రకటించారు.

ఈ సంస్థ నిర్వాహకులలో ఒకరైన హరి మాదాల ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. లాటా సేవా కార్యక్రమాలను శ్రీని కొమరిసెట్టి వివరించారు. ఉగాది ఉత్సవం లోపు కనీసం 500 మందిని సభ్యులుగా చేర్చాలని రామ్ ఎలమంచిలి పేర్కొన్నారు. సేవాభావం కల్గిన సంస్థలను తెలుగువారు ఎప్పటికి ఆదరిస్తారని మరొక నిర్వాహకుడు తిలక్ కడియాల పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. విజయ్ భాస్కర్ నెక్కంటి, కిశోర్ కంటమనేని, శ్యాం గుండాల, మధు బోడపాటి, రంగా రావు, సురేష్ చిలకూరి, వెంకట్ ఆళ్ళ, శ్రీధర్ అద్దంకి, హరి కొంక, శ్రీనివాస్ కిల్లాడ, బెనర్జీ సుంకవల్లి, సురేష్ ఐనంపూడి, పాండు చిమట, అనిల్ యార్లగడ్డ, ప్రసాద్ పాపుదేశి, సమీర్ భవానిభట్ల, వీరబాబు అంబటి, కిషోర్ గరికపాటి, వర్మ దంతులూరి, శ్రీహరి అట్లూరి, జ్యోతి పచ్చునూరి, రఘు మద్దుల, శ్రీధర్ వెల్లమిన, రాజ్ కొల్మి, కృష్ణ గొర్రెపాటి, గిరి కల్లూరి, వినయ్ కన్నా, కోటి కోమటినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
The Los Angeles Telugu Community witnessed a historical event during the launch of a new Telugu organization called Los Angeles Telugu Association (LATA) on Saturday, 23rd of March, 2013. For the first time in the history of United States, a local Telugu organization has been formed with over 150 volunteers who believed that there is a genuine need for a service based organization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X