వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో స్వరకర్తల దినోత్సవం

By Pratap
|
Google Oneindia TeluguNews

Music and dance program in USA
న్యూజెర్సీ: ఇండియానా పోలీస్ కర్ణాటక సంగీత సంఘం ఆధ్వర్యంలో మార్చి 16వ తేదీ శనివారం సికామోర్ విద్యాలయంలో స్వరకర్తల దినోత్సవం జరిగింది. రెండు దశాబ్దాలకు పైబడి వస్తున్న ఈ సత్సాంప్రదాయాన్ని నూతన కార్యవర్గ సభ్యులు ఇనుమడించిన ఉత్సాహంతో, రసస్ఫూర్తితో కూడిన వాతావరణంలో సాగించారు.

కర్నాటక సంగీత సాధనోపాసకులకు బాసటాగా నిలుస్తూ, వివిధ సంగీత నృత్య సాంప్రదాయ రీతులనభ్యసిస్తున్న స్థానిక విద్యార్థినీవిద్యార్ధులను ప్రోత్సహించడంతోపాటూ, ప్రపంచ ప్రఖ్యాతినార్జించన కళాప్రపూర్ణుల కచేరీలను రసఙ్నులకందుబాటులోకి తేవడం మొదలైనవి తన నిర్దిష్ట లక్ష్యాలుగా పనిచేస్తోన్న సంస్థ కర్నాటిక్ మ్యూసిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియానాపోలిస్.

దువ్వూరి అన్నపూర్ణ గణపతి స్తోత్రంతో స్వరకర్తల దినోత్సవం ప్రారంభమైంది. ప్రఖ్యాత స్వరకర్త మహరాజా స్వాతి తిరుణాళ్ ద్విశతజయంతి సంధర్భాన్ని పురస్కరించుకొని, పలు విద్వాంసులు స్వాతి తిరుణాళ్ స్వరపరచిన కృతులని ఆలపించారు. స్థానిక అధ్యాపకులు తమ శిష్యగణంతో సమకూర్చిన గాన సుమాహారాలు స్వరవరదాయని దివ్యాభరణములై అలరారాయి. వాయులీన మృదంగ తరంగిణులు భరత నాట్య నృత్యభంగిల ముంగిటజేసిన గంధర్వగానములాహుతులను అలరింపజేశాయి.

ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడానికి ప్రోత్సాహం ధన వస్తు విషయ భావ రూపేణా లభ్యమైనదని, ఇటువంటి శుభపరణామాలు మరిన్ని తేజోపూరిత కార్యాచరణలు స్పూర్థి నిస్తాయని అధ్యక్షులు పేరీ సర్వేశ్వర, కార్యవర్గ సభ్యులు కొచ్చెర్లకోట శారద, ధవళ సోమ, బాలాజీ వీరమణి, గౌతం శచీంద్రలు అభిప్రాయపడ్డారు. మే నాల్గవ తేదీన పద్మభూషణ్ టి.ఎన్.శేషగోపాలన్ కచేరి జరుగుతుంది.

English summary
Music and Dance program were held at Indiana police of USA. Carntic musics has been applauded during this program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X