వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ పెళ్లి సర్టిఫికెట్‌తో మోసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Forgery
ఫగ్వారా: నకిలీ పెళ్లి సర్టిఫికెట్ ఆరోపణలపై యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఎన్నారై దంపతులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. యుకెలో నివసిస్తున్న సుఖ్‌జిత్ సింగ్, హర్‌ప్రీత్ కౌర్ అమర్ కిశోర్ పాస్సీ సహకారంతో ఓ ప్రార్థనా మందిరం నుంచి నకిలీ పెళ్లి సర్టిఫికెట్ పొందారని ఫగ్వారా పోలీసు సూపరింటిండెంట్ హర‌కమల్‌ప్రీత్ సింగ్ చెప్పారు.

ఆ కేసులో పాత్రకు గాను అర్బన్ ఎస్టేట్‌కు చెందిన అమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుఖ్‌జీత్ తన కూతురును పెళ్లికి పురికొల్పాడని హర్‌ప్రీత్ తల్లి శావిందర్ కౌర్ జూన్ 5వ తేదీన ఆరోపించింది. అయితే, హర్‌ప్రీత్ పెళ్లికి ఇష్టపడినట్లు పోలీసులు తమ దర్యాప్తు ద్వారా తెలుసుకున్నారు.

హర్‌ప్రీత్ గార్డియన్‌గా చెప్పుకుని అమర్ ఓ ప్రార్థనా మందిరం నుంచి నకిలీ పెళ్లి సర్టిఫికెట్ వచ్చేలా చూసినట్లు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరు యుకె వెళ్లిపోయారు. ముగ్గురిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
A UK-based NRI couple was booked today for procuring a fake marriage certificate, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X